భయమా..డీజీపీ సారు!!

సాక్షాత్తూ ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ ని ఎవరో బయపెట్టినట్లున్నారు.ఆయన మాట్లాడే తీరు చూస్తే అలానే అనిపిస్తుంది.

 Dgp Controversial Statements On Ap Govt-TeluguStop.com

మరి అది ఎవరనేది తెలీదు కానీ.విషయం ఏమిటంటే…ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి ఏపీ డీజీపీ రాముడు చేసిన వ్యాఖ్యానాలు అంటూ మీడియాలో కొన్ని రోజులుగా కొన్ని వార్తలు హల్ చల్ చేస్తూ ఉండడంతో.

ఈయన పాపులారిటీ మరింత పెరిగిపోయింది.ఇక ఆయన మాట్లాడుతూ తమపై రాజకీయ ఒత్తిడిలు తీవ్రంగా ఉన్నాయని రాముడు వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి.

పోలీసులను రాజకీయనేతలు పనిచేసుకోనివ్వడం లేదని అన్నాడట రాముడు.ప్రత్యేకించి అధికార పార్టీ నేతలు పోలీసులుపై ఒత్తిడి చేస్తున్నారని.

పని చేసుకోనివ్వడం లేదని రాముడు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి.మరి తెలుగుదేశం వారు కోరి తెచ్చి పెట్టుకొన్న పోలీసులు దొర ఇలాంటి మాటలు మాట్లాడటం ప్రభుత్వానికి నైతికంగా ఇబ్బందికరమైన అంశమే అయ్యింది.

అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం రాముడు మాటలపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.ఆయన మాట్లాడింది కూడా ఆఫ్ ది రికార్డు గా కావడంతో మీడియా కూడా ఎవరినీ రెట్టించలేకపోయింది.

కధ ఇంతవరకు బాగానే ఉన్నా…అసలు ట్విస్ట్ ఇదే…ఇప్పుడు రాముడు గారు తమపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవని అంటున్నారు.పోలీసులుపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లూ లేవని స్పష్టం చేశాడు! మరి గతంలో రాజకీయ ఒత్తిళ్లను భరించలేకపోతున్నాదీ ఈయనగారే.

ఇప్పుడు అలాంటివేమీ లేదంటున్నదీ ఈయన.మరి ఇంతలోనే ఈ మార్పుకు కారణం భయమా.లేక వేరే ఏమైనా కారణమా ఆయనకే తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube