సాధారణంగా నేతలు పార్టీలు మారడం సహజమే.కానీ గత ఎన్నికల్లో పాపం చాలా మంది నేతలు ఆవేశంతో పార్టీలు జంప్ చేశారు.
అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఒక బలమైన సామాజికవర్గంగా ఉన్న “రెడ్డి” వర్గం ఎక్కువ శాతం తమ నేత జగన్ వైపు అడుగులు వేశారు.అద్భుతం జరగనుంది అని ముందే ఆశపాడి పాపం అటువైపుగా వెళ్ళి పప్పులో కాలేశారు.
అద్భుత్వం జరగక పోగా చివరకు అధికారం సైతం లేకుండా పోయింది.ఇదంతా పక్కన పెడితే కడప జిల్లాలో ముఖ్యమైన నేతల్లో కందుల సోదరులు కీలక నేతలు అని చెప్పవచ్చు.
తెలుగుదేశం మద్దతుదారులుగా ఉండి.తీరా ఆ పార్టీ అధికారంలోకి వస్తున్న తరుణంలో బయటకు వచ్చి వైకాపాలో చేరి సర్వాన్ని కోల్పోయారు.
ఇక చేసేది ఏమీ లేక ఎక్కువ కాలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేక, తమకున్న డిమాండ్ దృష్ట్యా వారు భారతీయ జనతా పార్టీలోకి చేరిపోతున్నారు అని తెలుస్తుంది.ఇక రేపు అంటే 18న భారీ స్థాయిలో జన సమీకరణను చేపట్టి.
జన సభను నిర్వహించి బీజేపీలో చేరుతున్నారట.మరి భారతీయ జనతా పార్టీకి ఇది కొత్త కళ అనే అనుకోవాలి.
ఎందుకంటే బీజేపీకి జన సభ చాలా కొత్త.ఆంధ్రప్రదేశ్ ఈ మాత్రం సభలను ఏర్పాటు చేసే నేతలు ఎవరూ కనపడలేదు కమలదళంలో.
అయితే తమ ఎంట్రీతోనే ఈ లోటును తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు కందుల సోదరులు.తమ చేరికను ఉత్సవంలా నిర్వహించి బీజేపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు వారు.
మరి ఈ సభలు ఏ మేరకు విజయవంతం అవుతాయో చూడాలి.అంతేకాకుండా వారి రాక బీజేపీ కి ఎంతవరకు కలసి వస్తుందో మరి.







