సాధారణంగా వీడియో గేమ్స్ ఆడటం అంటే ఎక్కువ మంది చాలా ఇష్టపడతారు.అయితే ఇప్పుడున్న టెక్నాలజీ పుణ్యమా అంటూ వీడియో గేమ్స్ ఆడటం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది.
ఇదంతా ఎలా ఉన్నా, తైవాన్ దేశంలో జరిగిన ఒక దుర్ఘటన వింటే భయపడటమే కాకుండా, జాగ్రత్త పడవలసిన అవసరం చాలానే ఉంది.వివరాల్ళోకి వెళితే తైవాన్‌లోని తైపీకి చెందిన సెయ్(32) అనే వ్యక్తి స్థానిక ఇంటర్నెట్ కేఫ్‌లో మూడు రోజులపాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడాడు.
అయితే ఏకధాటిగా వీడియో గేమ్ ఆడిన అతను స్పృహ కోల్పోయాడు.మొదట నిద్రపోతున్నాడేమొ అనుకున్న కేఫ్ యజమాని పరీక్షించి చూడగా శ్వాస అడకపోతూ ఉండడంతో హుటా హుటిన ఆసుపత్రికి తరలించాడు.
అతన్ని పరీక్షించిన వైధ్యులు సెయ్ మరణాన్ని ద్రువీకరించారు.అతనికి అనారోగ్య లక్షణాలు ఏవీ లేవని.
అయితే నిరంతరాయంగా వీడియో గేమ్ ఆడటం వల్ల గుండె ఆగిపోయి ఉంటుందని వైధ్యులు చెప్పారు.ఇక చేసేది ఏమీ లేక సెయ్ మృతి విషయాన్ని అతని కుటుంబసభ్యులకు ఆ కేఫ్ సిబ్బంది చేరవేశారు.







