రాజకీయాల్లో అధికార దాహం ఉండని నేతలు ఉన్నారు అని ఏ నేత అయిన ప్రకటించుకుంటే ఆయన హాస్యం చేస్తున్నాడు అని తప్పక ఒప్పుకోవాల్సిందే.పార్టీలు మరే నేతలకు అనేక కారణాలు ఉండవచ్చు, కానీ చివరకు వారి టార్గెట్ మాత్రం ప్రజా ప్రతినిధులుగా గెలవడం, మంత్రి పదవి ఆశించడం.
ఇక అదే కోవలో అనేక మంది నేతలు అధికార పార్టీ తీర్ధం పుచ్చుకోవడం సహజం.ఇదంతా పక్కన పెడితే అనంతపురం రాజకీయాల్లో జేసీ దివాకర్రెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం అనే చెప్పాలి.
వైఎస్ఆర్ కు వ్యతిరేకిగా ముద్ర వేయిచుకున్న ఆయన ఎన్నికల ముందు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు.అయితే ఇప్పుడు ఆయన పై వస్తున్న ప్రధాన విమర్శ ఆయన మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారు అని.ఇక ఆ వాదనపై ఆయన స్పందిస్తూ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుకపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ తానెప్పుడూ మంత్రి పదవి ఆశించలేదని, ఇప్పించండని చంద్రబాబును అడగలేదని, భవిష్యత్తులో కూడా అడగబోనని నిజంగా నాకు మంత్రి పదవి పై ఆశ ఉంటే చంద్రబాబుతో మాట్లాడే ధైర్యం తనకు ఉంది అని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే రాజకీయ పరిస్థితుల కారణంగానే చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు అని, వాటిని దశల వారీగా అమలు చేస్తున్నందుకు ఆయన్ని అభినందిస్తున్నాను అని జేసీ వెల్లడించారు.
మరి ఎప్పుడూ లేని విధంగా బాబును పొగడటం ఎందుకో…
.






