సీమాంధ్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ అనేక సవాళ్లను ఎదుర్కుంటుంది.ఇక ప్రస్తుతం రాజధాని నిర్మాణం, రునమాఫి, ఫీజ్-రీఎంబర్స్‌మెంట్ వంటి వాటిపై దృష్టి పెట్టిన టీడీపీ సర్కార్.
అదే బాటలో సంక్రాంతి కానుకగా అనేక వరాలను కురిపిస్తుంది.ఇంతవరకు బాగానే ఉన్నా ఆ వరాలు అన్నీ తమ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకే కేటాయించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.
విషయం ఏమిటంటే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితుల్లో నియోజక వర్గాల అభివృద్దికై పైసా కూడా మంజూరు చెయ్యలేదు.కానీ సంక్రాంతి కానుకగా ప్రభుత్వ నిధులను కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇక దీనిపై షరా మామూలుగానే ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి.చట్ట సభల సభ్యులందరూ సమానమేననీ, అందరికీ ఒకే హక్కులు ఉంటాయనీ, ప్రభుత్వం కేవలం తెలుగుదేశం సభ్యులకు మాత్రమే నిధులు ఇవ్వాలనుకోవడాన్ని ప్రతిపక్ష శాసనసభ్యులు తప్పు పడుతున్నారు.
దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు.లేకపోతే పోరు తప్పదని హెచ్చరిస్తున్నారు.
మరి దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.







