రాజకీయం అంటే రోజుకో రంగు మార్చే ఊసరవిల్లి అని చిన్న పిల్లాన్ని అడిగిన చెబుతాడు.అయితే అలాంటి రాజకీయం మన తెలుగు రాష్ట్రంలో సైతం తక్కువ ఏమీ కాదు అన్న సంగతి అందరికి తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న తాజా రాజకీయ పరిస్థితుల్లో పాలక పక్షాన్ని ధీటుగా ఎదుర్కునే ప్రతిపక్షం లేదనే విమర్శ ఒకింత బలంగానే వినిపిస్తూ ఉండడంతో ఆ బలహీనతను బలంగా మార్చుకుంటూ ముందుకు పోతుంది కమల దళం.అదే బీజేపీ పార్టీ.ఇప్పటికే తెలంగాణాలో బీజేపీ పరిస్థితి ఒకింత మెరుగ్గా కనిపిస్తూ ఉండడంతో, అటు సీమంధ్రలోను 2019నాటికి తన సత్తా చాటాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహ ప్రాతివ్యహాలు రచిస్తున్నారు.అయితే దానిలో భాగంగానే నీరుగారిపోయి తెలుగుదేశం సునామీలో కొట్టుకుపోయిన కొంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ తమ పార్టీ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇక ఇప్పటికే కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకోగా, మరో కొంగ్రెస్ బడా నేత బొత్సా సైతం అదే రూట్ లో ఉన్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.మరి ఇదే మాదిరిగా నేతలందరూ బీజేపీ వైపు మొగ్గు చూపితే మాత్రం రానున్న ఎన్నికలు తెలుగుదేశానికి అగ్ని పరీక్షగా మారతాయి అనడంలో సందేహం లేదు.







