ప్రస్తుతం అస్సెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపైన కన్నా ఇరు పార్టీల బాహా బాహీల నడుమ తమ బలం ఎంతో తేల్చుకునే క్రమంలో ముందుకు పోతున్నాయి.అయితే గతంలో మాదిరిగానే ఇప్పటి ప్రభుత్వం సైతం వ్యవహరిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
గతంలో వైఎస్ఆర్ సభలో ఉన్న సమయంలో ఆయన చంద్రబాబు పై చేసిన విమర్శలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి.అంతేకాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిని సైతం దిగజార్చాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అయితే గతంఅంతా పక్కన పెడితే ఇప్పుడు సైతం తెలుగు దేశం ప్రభుత్వ ఎం.ఎల్.ఏ ల తీరు విమర్శలకు దారి తీస్తుంది.రాజధాని బిల్లు విషయంలో ప్రతి పక్ష నేతగా జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించిన తరువాత తెలుగు దేశం ఎమ్.ఎల్.ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఒక పద్యాన్ని చదివి జగన్ ని మూర్కుడుగా వర్ణించారు.అంతేకాకుండా వైకాపా ప్రజా ప్రతినిధి రోజాను సైతం విలన్ అంటూ విమర్శిస్తూ, వైకాపా నాయకులు అంతా రౌడీలు అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు.మరి వయసు ప్రభావం అనుకోవాలో, లేక కావాలనే ఇలా మాట్లాడారో తెలీదు కానీ, ఇది ఇలానే కొనసాగితే మాత్రం చంద్ర బాబు సర్కారుకు ఇబ్బందులు తప్పవు అనే చెప్పుకోవాలి.







