బాలయ్య తో పెట్టుకోను!!!

నందమూరి బాలకృష్ణ కధానాయకుడిగా ప్రస్తుతం నటిస్తున్న 98వ చిత్రం “లయన్”.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి ఈ టైటిల్ ను ఎంచుకోవడం పై కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.

 Trisha About Balakrishna-TeluguStop.com

అవేమిటంటే ఈ టైటిల్ ను ఇప్పటికే తెలంగాణా కు చెందిన ఒక నిర్మాత తన సినిమా కోసం రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తుంది.అయితే ఒకవేళ ఈ టైటిల్ ను వాడుకోవాల్సి వస్తే బాలయ్య చిత్ర దర్శక నిర్మాతలే తప్పితే ఆ తెలంగాణా నిర్మాత మాత్రం తాను వెనక్కి తగ్గేదే లేదు అని చెబుతున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్యతో ఈ చిత్రంలో నటిస్తున్న త్రిష మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ తాను బాలయ్యతో పెట్టుకోను అని సమాధానం ఇచ్చింది.అసలు విషయం ఏమిటంటే గతంలో సినీపరిశ్రమలో మేల్ డొమినేషన్ ఎక్కువ కావడం వల్లనే హీరోయిన్స్ కు ఇంపార్టెన్స్ ఉండదు అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే దాని వల్లనే మీకు అవకాశాలు తగ్గాయా అని మీడియా ప్రశ్నించగా ఆమె బదులిస్తూ నాకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి.కాకపోతే చిత్ర పరిశ్రమలో హీరో తరువాత, దర్శకుడికి ఇంపార్టెన్స్ ఉంటుంది.

హీరోయిన్స్ కి సినిమా సక్సెస్, ఫేల్యూర్ విషయంలో సంబంధం ఉండదు అంటూ మాట మార్చి మీడియా నుంచి తప్పించుకుంది.మరి ఆమెలో మార్పుకు కారణం బాలయ్య పై భయమో, లేక తన సినీ కరియర్ పై ఒకింత ఆలోచనా తత్వమొ ఆమెకే తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube