సూర్యాపేట జిల్లా:మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం హెచ్చరించారు.జిల్లా ఎస్పీ కె.
నరసింహ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్
తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఆరుగురు పట్టుబడగా వారిని మంగళవారం కోర్టులో హాజరు పరచగా సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బి.వి.రమణ ఒక్కరికి ఒక రోజు జైలు శిక్ష మరియు రూ.2000/-జరిమానా విధించారన్నారు.మద్యం సేవించిన ముగ్గురికి కలిపి రూ.4,000/-జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడే వారికి చలానాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు.







