హాట్ కాఫీ వ‌ర్సెస్ కోల్డ్ కాఫీ.. ఆరోగ్యానికి ఏది బెస్ట్‌..?

షుగ‌ర్ లేకుండా, మితంగా తీసుకుంటే కాఫీ ఆరోగ్య‌క‌ర‌మే అని చాలా అధ్యయనాలు తేల్చాయి.కాఫీలో హాట్ కాఫీని( Hot Coffee ) ఇష్ట‌ప‌డేవారు కొంద‌రైతే.

 Hot Coffee Or Cold Coffee Which Is Best For Health Details, Hot Coffee, Hot Cof-TeluguStop.com

కోల్డ్ కాఫీని( Cold Coffee ) ఇష్ట‌ప‌డేవారు మ‌రికొంద‌రు.అయితే హాట్ కాఫీ మ‌రియు కోల్డ్ కాఫీలో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.

అది మీ శరీరం ఎలా రియాక్ట్ అవుతుందో, ఎప్పుడెప్పుడు తాగుతున్నావో మీద ఆధారపడి ఉంటుంది.మిల్క్ కాఫీ మిక్స్‌తో చక్కెర తక్కువగా వేసి చేస్తే.

హాట్ కాఫీ అయినా, కోల్డ్ కాఫీ అయినా హెల్తీనే అని చెప్పుకోవ‌చ్చు.

అయితే హాట్ మరియు కోల్డ్ కాఫీల్లో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి.

హాట్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇవి శరీరంలో టాక్సిన్లను బ‌ట‌య‌కు పంప‌డంలో తోడ్ప‌డ‌తాయి.

రెగ్యులర్ గా మితంగా హాట్ కాఫీ తాగే వారిలో కొలెస్ట్రాల్ లెవల్స్( Cholestrol Levels ) త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లు అధ్య‌య‌నాలు చెబుతున్నారు.అలాగే హాట్ కాఫీ కొన్ని సందార్బాల్లో జీర్ణక్రియను మెరుగుప‌రుస్తుంది.

శ‌రీరంలో రక్త ప్రసరణను( Blood Circulation ) కూడా పెంచుతుంద‌ని అంటారు.చలికాలంలో హాట్ కాఫీ తాగ‌డానికి చాలా బావుంటుంది

Telugu Coffee, Coffee Benefits, Creams, Tips, Hot Coffee, Hotcoffee, Latest, Sug

కోల్డ్ కాఫీ విష‌యానికి వ‌స్తే.ఇందులో ఆమ్లత్వం తక్కువగా ఉంటుంది.గ్యాస్, అసిడిటీ సమస్యల‌తో బాధ‌ప‌డేవారికి కోల్డ్ కాఫీ మంచి ఆప్ష‌న్ అవుతుంది.

కోల్డ్ కాఫీ శ‌రీరానికి తక్ష‌ణ ఎనర్జీని ఇస్తుంది, ఫోకస్ ను పెంచుతుంది.వేసవిలో కోల్డ్ కాఫీ తాగితే బాడీ కూల్ అవుతుంది.

స‌మ్మ‌ర్ హీట్ నుంచి చ‌క్క‌ని రిలీఫ్ ను అందిస్తుంది.ఫైన‌ల్ గా చెప్పేది ఏంటంటే.

యాంటీ ఆక్సిడెంట్లు, వేడి సౌలభ్యాన్ని కోరుకునేవారు హాట్ కాఫీని ఎంచుకోవాలి.అసిడిటీ, గ్యాస్ సమస్యలుంటే కోల్డ్ కాఫీ వైపు వెళ్లొచ్చు.

కాఫీ ఏదైనా చక్కెర, క్రీమ్స్ వంటివి వాడ‌క‌పోవ‌డం ఎంతో ఉత్త‌మం.

Telugu Coffee, Coffee Benefits, Creams, Tips, Hot Coffee, Hotcoffee, Latest, Sug

అలాగే కాఫీని మితంగా తీసుకోవాలి.అలా కాకుండా రోజూ 2–3 కప్పులు, అదీ ఎక్కువ చక్కెరతో తాగితే నిద్ర‌లేమి, గుండె స్పందన పెరగడం, ర‌క్త‌పోటు అదుపు తప్ప‌డం, వెయిట్ గెయిన్‌, మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్ పెర‌గ‌డం, గ్యాస్ట్రిక్ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.జాగ్రత్త‌!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube