సినిమా టికెట్ కొనకుండా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేకుండా లైవ్ రొమాంటిక్ సీన్( Romantic Scene ) చూస్తారా, నమ్మడానికి కష్టంగా ఉంది కదూ, కానీ ఇది నిజంగా జరిగింది.మెట్రో స్టేషన్( Metro Station ) దగ్గర ఓ జంట చేసిన పని అందర్నీ షాక్‌కి గురిచేసింది.
నవ్వించింది కూడా.
విషయం ఏంటంటే, మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ఓయో రూమ్‌లో( OYO Room ) ఓ జంట ఉన్నారు.
వాళ్ల రూమ్‌కి ఉన్న బాల్కనీ డోర్ మాత్రం ఫుల్లుగా తెరిచి ఉంది.అది డైరెక్ట్‌గా మెట్రో ప్లాట్‌ఫామ్ వైపు ఉండటంతో లోపల ఏం జరుగుతుందో అంతా క్లియర్‌గా కనిపించేసింది.
ఆ జంట లోపల వాళ్ల పనిలో మునిగిపోయారు కానీ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న జనాలు మాత్రం ఫుల్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేశారు.

అప్పుడే జనం గుంపులోంచి ఒకతను గట్టిగా అరిచాడు.“బ్రదర్.కనీసం తలుపు వేసుకోండి బ్రో” అని కామెంట్ చేశాడు.
దాంతో ప్లాట్‌ఫామ్ మొత్తం ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది.చాలామంది వెంటనే ఫోన్లు తీసి వీడియోలు తీయడం మొదలుపెట్టారు.
ఆ వీడియోలో చూస్తే, వాళ్లు ఎంతసేపటి వరకు జనాలు చూస్తున్నారని గమనించలేదో అర్ధమవుతుంది.

ఇదంతా @mahiiii._.17 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయడంతో వైరల్ అయిపోయింది.వీడియోకి 2 లక్షల 92 వేలకు పైగా లైకులు వచ్చాయి.ఇక కామెంట్ల సెక్షన్ అయితే ఫన్నీ కామెంట్లతో నిండిపోయింది.ఒక యూజర్ “ఇంకా గేట్ ఎందుకు? ఇది లీక్ అయిపోతుంది కదా” అని పంచ్ వేశాడు.ఇంకొకరు “ఇది ఎగ్జిబిషన్ షో లా ఉంది” అని కామెంట్ చేస్తే.
మూడో వ్యక్తి మాత్రం “ఆ బ్రదర్ నిజంగా పబ్లిక్ హీరో” అంటూ నవ్వేశాడు.
వీడియోలో ఆ జంటకు ఫైనల్‌గా జనాలు చూస్తున్నారని తెలిసింది.
వెంటనే ఆ వ్యక్తి లేచి బాల్కనీ డోర్ క్లోజ్ చేశాడు.దాంతో అనుకోకుండా లైవ్ షోకి ఎండ్ కార్డ్ పడింది.
ఇప్పుడు ఈ షాకింగ్ అండ్ ఫన్నీ మూమెంట్ ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్.రొమాంటిక్‌గా గడపాలనుకున్న టైమ్.
ఇలా పబ్లిక్ స్పెెక్టాకిల్‌గా మారిపోయింది.ఈ రోజుల్లో ఏదైనా ఎంత ఫాస్ట్‌గా వైరల్ అవుతుందో చెప్పడానికి ఇది మరో నిదర్శనం.







