తాజ్‌మహల్ అనగానే ప్రేమకు చిహ్నం, ప్రపంచ వింతల్లో ఒకటి.కానీ ఈసారి మాత్రం అక్కడ ప్రేమ కాదు భయం కనిపించింది.
నిన్న ఆదివారం, ఆగ్రాలోని తాజ్‌మహల్‌లో (Taj Mahal in Agra)ఒక్కసారిగా తేనెటీగలు(Bees) రెచ్చిపోయాయి.దాంతో సందర్శకులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఏం జరుగుతుందో తెలిసేలోపే తేనెటీగల దండు విరుచుకుపడింది.
గట్టిగా వీచిన గాలులకి తేనెటీగలు (Bees)రెచ్చిపోయి అందరిపై దాడి చేశాయి.
పర్యాటకులైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.పోలీసులు కూడా తేనెటీగల దాడికి భయపడి పారిపోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చాలామందికి తేనెటీగలు కుట్టడంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది.
అసలు విషయానికొస్తే, తాజ్‌మహల్ మెయిన్ డోమ్(Taj Mahal Main Dome) ఆర్చ్‌లో తేనెటీగలు పుట్ట పెట్టుకున్నాయి.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సిబ్బంది దాన్ని తొలగించారు.కానీ అవి మళ్లీ రాయల్ గేట్ దగ్గర ఇంకో పుట్ట పెట్టాయి.దురదృష్టవశాత్తు ఆదివారం మధ్యాహ్నం బలమైన గాలులు వీచడంతో తేనెటీగలు అల్లకల్లోలం చేశాయి.వీకెండ్ కావడంతో తాజ్‌మహల్‌లో జనం కిక్కిరిసి ఉన్నారు.
సడన్‌గా తేనెటీగలు దాడి చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొందరు గాయపడ్డారు.వెంటనే వాళ్లకు డిస్పెన్సరీలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు.

గతంలో కూడా తాజ్‌మహల్‌లో తేనెటీగలు పర్యాటకులపై దాడి చేశాయి.అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని జనాలు మండిపడుతున్నారు.సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రిన్స్ వాజ్‌పేయి మాత్రం ఏం చెప్పారంటే.“మేం రెగ్యులర్‌గా తేనెతుట్టెలను తొలగిస్తూనే ఉన్నాం.కానీ తేనెటీగలు మళ్లీ వేరే చోట కట్టుకుంటున్నాయి.ఇప్పుడున్న పుట్టను కూడా త్వరలోనే తొలగిస్తాం” అని చెప్పారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు రోజు అంటే శనివారం ప్రతాప్‌గఢ్ జిల్లాలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది.లాలా కా పుర్వా గ్రామం దగ్గర పొలాల్లో పనిచేసుకుంటున్న ముగ్గురిపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి.పన్నా లాల్ (40), నందలాల్ (65), ఆయన కొడుకు రవికాంత్ (32) అనే ముగ్గురికి తేనెటీగలు విపరీతంగా కుట్టాయి.ఊర్లో వాళ్లు వెంటనే వాళ్లని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించారు.
తాజ్‌మహల్ అయినా, ప్రతాప్‌గఢ్ అయినా తేనెటీగల దాడులు మాత్రం ఆగడం లేదు.ఇప్పటికైనా అధికారులు మేలుకుని ఏదో ఒకటి చేయకపోతే మాత్రం ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో కూడా జరిగే ప్రమాదం ఉంది.







