భారత క్రికెట్‌లో లెజెండరీ (Legendary in Indian cricket)ఆటగాళ్లలో ఒకరైన సౌరభ్ గంగూలీ(Sourav Ganguly), ‘దాదా’గా అభిమానులు ప్రేమగా పిలిచే ఈ మాజీ కెప్టెన్, తన అగ్రెసివ్ ఆటతీరుతో భారత జట్టుకు కొత్త శక్తిని అందించాడు.గంగూలీ (Ganguly) నాయకత్వంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది.2000 దశకంలో భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన గంగూలీ, కెప్టెన్‌గా, ఆటగాడిగా అపూర్వమైన గుర్తింపు సంపాదించాడు.ఆటగాడిగా రిటైర్ అయినా, ఆయన క్రికెట్‌లో కొనసాగుతూ, బీసీసీఐ అధ్యక్షుడిగానూ సేవలందించారు.
అయితే తాజాగా ఆయన మరో కొత్త పాత్రలో దర్శనం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న క్రైమ్-థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ (Crime-thriller web series ‘Khaki: The Bengal Chapter)మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోదా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించబడింది.ముందుగా ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ పేరుతో వచ్చిన ఈ వెబ్ సిరీస్, 2022లో విడుదలై విశేషమైన ప్రజాదరణ పొందింది.బిహార్ మాఫియాలకు వ్యతిరేకంగా పోరాడిన పోలీసుల కథను ఆధారంగా తీసుకుని, యథార్థ ఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించగా, ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఇప్పుడీ సక్సెస్‌కు కొనసాగింపుగా ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ పేరుతో సీక్వెల్ రూపొందించబడింది.దీనికి సంబంధించి మార్చి 17న (సోమవారం) ప్రోమో విడుదలైంది.ఈ ప్రోమోలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పోలీస్ అధికారిగా కనిపించడంతో, క్రికెట్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ప్రోమో వీడియోలో, గంగూలీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించాడు.ప్రోమో ప్రారంభంలో “బెంగాల్ పేరుతో సిరీస్ తీస్తుంటే, దాదాను పిలవరా?” అనే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది.అయితే, ప్రోమో చివర్లో గంగూలీ సీరియస్‌గా కథానాయకుడికి వేషాలు ఎలా వేయాలో డైరెక్టర్ చెప్పగా, “ఇవన్నీ నా వల్ల కావు!” అంటూ హాస్యంగా సమాధానమిచ్చాడు.
గంగూలీ ‘ఖాకీ 2’లో అతిథి పాత్రలో కనిపించనున్నారని, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే తాజా ప్రోమోతో దీనిపై స్పష్టత వచ్చింది.గంగూలీ ఈ వెబ్ సిరీస్‌లో నటించలేదని, కేవలం ప్రచార కార్యక్రమంలో భాగంగా మాత్రమే పాల్గొన్నారని నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చింది.
ఈ వెబ్ సిరీస్ మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్, ప్రేక్షకులకు మరొకసారి రక్తి కట్టించేలా ఉండబోతోందని అంటున్నారు.గంగూలీని నిజమైన పోలీస్ ఆఫీసర్‌గా వెబ్ సిరీస్‌లో చూస్తామా? లేక ఆయన కేవలం ప్రోమోలో భాగమేనా? కనిపించాడా అనేది చూడాలి మరి.