ఎన్నారైలకు బిగ్ షాక్.. ఇండియాలో ట్యాక్సులు కట్టాల్సిందేనా.. అమెరికన్ సలహా వైరల్!

భారతీయులపై పన్నుల భారం ఎక్కువైందని చాలామంది ఫీలవుతున్నారు.దీన్ని తగ్గించడానికి ఒక అమెరికన్ మహిళ ( American woman )చెప్పిన సలహా మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Do Nris Have To Pay Taxes In Big Shock India American Advice Goes Viral , Nri Ta-TeluguStop.com

బెంగళూరులో( Bangalore ) ఉంటున్న డానా మేరీ ( Dana Marie )అనే అమెరికన్ మహిళ, ఎన్నారైలు కూడా ఇండియాలో ట్యాక్స్ కట్టాలని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది.ఇలా చేస్తే ఇక్కడ భారతీయులపై పన్నుల భారం తగ్గుతుందని ఆమె వాదిస్తోంది.

ఈ విషయాన్ని ఆమె మెటాకి చెందిన థ్రెడ్స్ యాప్ ( Threads app )లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా దుమారం రేగింది.ఇండియాలో పన్నులు మరీ దారుణంగా ఉన్నాయని ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

చాలామంది భారతీయులు ఎక్కువ పన్నులు కట్టలేక విదేశాలకు వెళ్లిపోతున్నారని డానా వాపోయింది.ఎన్నారైలు కూడా ట్యాక్స్ కడితే ఇండియా ఆర్థికంగా మరింత బలపడుతుందని, దేశంలో టాలెంట్ ఉన్నవాళ్లు ఇక్కడే ఉండి వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సాహం లభిస్తుందని ఆమె అభిప్రాయపడింది.

ఎన్నారైలు ఇండియాలో నివసించే వాళ్లలాగే ఫుల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు కానీ, ఏదో ఒకరకంగా కొంచెం ట్యాక్స్ కడితే మంచిదని ఆమె సూచించింది.దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇండియాలో ఉండేవాళ్లపై పన్నుల టెన్షన్ కూడా తగ్గుతుందని ఆమె తన థ్రెడ్‌లో రాసుకొచ్చింది.

Telugu Nrispay, Expat Tax, India Nri Tax, India Tax, Indian Expats, Nri Tax, Nri

డానా చేసిన ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో రచ్చ రేగింది.చాలామంది ఆమెతో ఏకీభవించలేదు.ఎన్నారైలు ఇండియాలో ఉండరు కాబట్టి ఇక్కడి రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు లాంటి సౌకర్యాలేవీ వాడరు.అలాంటి వాళ్లకి ట్యాక్స్ ఎందుకు వెయ్యాలని చాలామంది నెటిజన్లు ప్రశ్నించారు.ఇన్ కమ్ టాక్స్ అనేది దేశంలో మౌలిక సదుపాయాలు, పరిపాలన కోసమని, ఎన్నారైలు ఇవేవీ యూజ్ చేయనప్పుడు వాళ్లను ట్యాక్స్ కట్టమనడం కరెక్ట్ కాదని కొందరు గట్టిగా వాదించారు.ఒకవేళ ఎన్నారైలపై ట్యాక్స్ రూల్ పెడితే, మళ్లీ ఇండియాకు తిరిగి రావాలనుకునే ఎన్నారైలు కూడా వెనకడుగు వేస్తారని ఇంకొందరు కామెంట్ చేశారు.

Telugu Nrispay, Expat Tax, India Nri Tax, India Tax, Indian Expats, Nri Tax, Nri

దుబాయ్ లో ఉంటున్న ఎన్నారై, మిథేష్ అస్వాని అనే వ్యక్తి డానా వాదనను తప్పుబట్టాడు.ఎన్నారైలు ఆల్రెడీ చాలా రకాలుగా ఇండియా ఆర్థిక వ్యవస్థకు హెల్ప్ చేస్తున్నారని ఆయన అన్నాడు.ఇక్కడ వాళ్ల ఆస్తులు, పెట్టుబడులు ఇంకా ఇతర ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ట్యాక్స్ కడుతూనే ఉన్నారని మిథేష్ గుర్తు చేశాడు.డానాకు విషయం సరిగ్గా తెలియక ఇలా మాట్లాడిందని ఆయన విమర్శించాడు.

మొత్తానికి డానా చేసిన ఈ కామెంట్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.చాలామంది ఆమె సలహాను వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube