టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు.( Hari Hara Veeramallu ) ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా మార్చి 28వ తేదీ విడుదల కాబోతోంది అనే హరిహర వీరమల్లు సినిమా నిర్మాతలు చెప్పారు.
కానీ ఈ విడుదల తేదీ వాయిదా వేశారని మార్పులు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.కానీ వాయిదా ప్రసక్తే లేదనే తరహాలో ప్రమోషన్లలో ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు.
ఇంకొంచెం బ్యాలన్స్ ఉన్నప్పటికీ ఇంత ధీమాగా ఎలా ఉన్నారని ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.పవన్ ఒకపక్క రాజకీయ, సామజిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

ఇటీవలే కుంభమేళాకు కూడా వెళ్లి వచ్చారు.ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు.ఇవన్నీ చూస్తుంటే అసలు డబ్బింగ్ చెప్పడానికైనా పవన్ కు టైం దొరుకుతుందానే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది.ఇక అపోజిషన్ సంగతి చూస్తే మార్చి 28 రాబిన్ హుడ్( Robinhood ) వస్తోంది.
మైత్రి వాళ్ళు క్రమం తప్పకుండా ఇదే డేట్ వేసుకుంటూ వస్తున్నారు.ఒకవేళ పవన్ సినిమా ఉందంటే ఆయన వీరాభిమనిగా నితిన్ ఈ క్లాష్ ని ఎంత మాత్రం ఒప్పుకోడు.
మార్చి 29 సితార వాళ్ళ మ్యాడ్ స్క్వేర్( Mad Square ) రావడం ఫిక్సయిపోయింది.టీజర్ అనౌన్స్ మెంట్ యాడ్ లో దీన్ని మరోసారి స్పష్టం చేశారు.
పవన్ తో నాగవంశీకి ఉన్న అనుబంధం తెలిసిందే.హరి హర వీరమల్లు లాంటి పాన్ ఇండియా మూవీకి ఎదురు రావడం అన్నది కాస్త రిస్క్ అని చెప్పాలి.

ఇకపోతే చావా సినిమాకు( Chhaava Movie ) వచ్చిన స్పందన చూశాక మొఘలుల మీద తిరుగుబాటు చేసిన మన తెలుగు వీరుడు వీరమల్లుకి కూడా అంతే రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.మరి హరిహర వీరమల్లు సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? చావా సినిమా రేంజ్ లో హిట్ అవుతుందా అన్నది తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.కానీ మూవీ మేకర్స్ మాత్రమే ఈ విషయం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.







