పాకిస్థాన్‌లో (Pakistan)సభ్యసమాజం తలదించుకునే దారుణం జరిగింది.అమ్జద్ అనే పోలీసు కానిస్టేబుల్ ఓ బిచ్చగత్తెపై అత్యాచారయత్నానికి(Police attempt to rape a beggar) పాల్పడ్డాడు.
ఈ నీచమైన చర్యను వీడియో తీస్తున్న వ్యక్తిపై ఏకంగా కాల్పులు జరపడం సంచలనంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
వివరాల్లోకి వెళితే, లాహోర్‌లో రోడ్డు పక్కన బిక్షాటన చేస్తున్న దివ్యాంగురాలిని గమనించిన కానిస్టేబుల్ అమ్జద్ (Constable Amjad)ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లాడు.మద్యం మత్తులో ఉన్న అమ్జద్ ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.
ఆ మహిళ భయంతో కేకలు వేయడంతో స్థానికులు అటుగా చేరుకున్నారు.అయితే అప్పటికే ఓ వ్యక్తి తన ఫోన్‌లో ఈ దుర్మార్గాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు.
తన బాగోతం వీడియోలో రికార్డ్ అవుతుండటాన్ని గమనించిన అమ్జద్ ఆగ్రహంతో ఊగిపోయాడు.వీడియో తీస్తున్న వ్యక్తిని ఆపడానికి ప్రయత్నించాడు.కానీ ఆ వ్యక్తి ప్రతిఘటించడంతో ఏకంగా తన వద్ద ఉన్న ఏకే-47 రైఫిల్‌తో (AK-47 rifle)అతడి కాలిపై కాల్పులు జరిపాడు.తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
“సుప్రియా సవర్ణ్” (Supriya Savarn)అనే యూజర్ ఎక్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలీసు అధికారి చేసిన ఈ దారుణానికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.దేశంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి నేరాలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై లాహోర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) వెంటనే స్పందించారు.నిందితుడు అమ్జద్‌ను సస్పెండ్ చేశారు.
అతనిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు.
నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అయితే ఈ ఒక్క ఉదంతం పాకిస్థాన్‌లో పోలీసుల జవాబుదారీతనంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.చట్టాన్ని పరిరక్షించాల్సిన వారే ఇలాంటి నేరాలకు పాల్పడితే సామాన్యులకు ఎవరు రక్షణ కల్పిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.అధికార దుర్వినియోగానికి పాల్పడే ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు.