పంచదార కాదు బాస్.. బెల్లం టీ తాగితే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం!

ఉద‌యం లేవ‌గానే వేడి వేడి టీ తాగే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.అందులోనూ ప్ర‌స్తుత చ‌లికాలంలో క‌డుపులోకి టీ పోన‌దే ఏ ప‌ని చేయ‌లేదు.

 Health Benefits Of Drinking Jaggery Tea Details, Jaggery Tea, Jaggery Tea Health-TeluguStop.com

అయితే టీలో వేసే పంచ‌దార( Sugar ) అనేక దుష్ప్రభావాలను క‌లిగిస్తుంది.పంచ‌దార‌లో పోష‌కాలు ఏమీ ఉండ‌క‌పోగా.

కేల‌రీలు అధిక మొత్తంలో ఉంటాయి.పంచ‌దార టీ( Sugar Tea ) రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలకు కార‌ణం అవుతాయి.

గుండె సంబంధిత సమస్యలు, జీర్ణ స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ పెరుగుతుంది.పంచదారతో తయారైన టీ బ‌రువు పెర‌గ‌డానికి దారి తీస్తుంది.

దంత ఆరోగ్యంపై ప్రభావం ప‌డుతుంది.అందుకే ఇక‌పై పంచదార కాదు బాస్.

బెల్లం టీ తాగ‌డం అల‌వాటు చేసుకోండి.

బెల్లం టీ( Jaggery Tea ) చాలా రుచిక‌రంగా ఉంటుంది.

పైగా అదిరిపోయే ఆరోగ్య లాభాల‌ను అందిస్తుంది.బెల్లం టీలో రక్తాన్ని శుభ్రపరచే లక్షణాలు ఉంటాయి.

బెల్లం టీను తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలోని విషాలు తొలగిపోతాయి.బాడీ డీటాక్స్( Body Detox ) అవుతుంది.

అలాగే బెల్లం ప్రకృతిసిద్ధమైన శక్తి ఉత్పత్తి చేస్తుంది.బెల్లం టీను తాగితే త‌క్ష‌ణ శ‌క్తి ల‌భించ‌డ‌మే కాకుండా మానసిక మరియు శారీరక అలసట దూరం అవుతుంది.

Telugu Detox, Tips, Jaggery, Jaggery Tea, Jaggerytea, Latest, Sugar Tea, Sugarte

బెల్లంలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు మ‌రియు అమైనో ఆమ్లాలు ఉంటాయి.ఇవి ర‌క్త‌హీన‌త‌ను త‌రిమికొట్ట‌డంతో.ఎముక‌ల‌ను బ‌లోపేతం చేయ‌డంలో తోడ్ప‌డ‌తాయి.బెల్లం టీ ఇమ్యూనిటీ బూస్ట‌ర్ గా ప‌ని చేస్తుంది.ఇది వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.బెల్లం టీ జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది.

ఫ‌లితంగా అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్య‌లు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.

Telugu Detox, Tips, Jaggery, Jaggery Tea, Jaggerytea, Latest, Sugar Tea, Sugarte

అంతేకాదండోయ్‌.బెల్లం లో సహజ గ్లూకోజ్ స్థాయిలు ఉండటంతో దానితో త‌యారు చేసే టీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.శాంతిని మరియు ప్రశాంతతను అందిస్తుంది.

కాబ‌ట్టి ఇకపై పంచ‌దార టీకు బ‌దులుగా బెల్లం టీను అల‌వాటు చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube