స్టీవ్ జాబ్స్ భార్య మహాకుంభమేళాలో ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!

దివంగత యాపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్( Steve Jobs ) సతీమణి లారెన్ పావెల్ జాబ్స్( Laurene Powell Jobs ) ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.2025 జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా జరగనున్న మహాకుంభమేళాలో( Maha Kumbhmela ) ఆమె సందడి చేయనున్నారు.అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, లారెన్‌కు కొత్త పేరు వచ్చింది.నిరంజని అఖాడాకు చెందిన కైలాశానంద గిరి మహారాజ్ ఆమెను తమ ‘కూతురిలాంటి’ బిడ్డగా భావిస్తూ ‘కమల’( Kamala ) అని పిలవనున్నారు.

 Steve Jobs Wife Laurene Powell Offers Prayers At Varanasi Temple Details, Lauren-TeluguStop.com

ఆమె ఆ హిందూ పేరును కూడా స్వీకరించింది.ఇలా ఆమె పేరు మార్చుకోవడం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

లారెన్ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వారణాసిలోని( Varanasi ) కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించడంతో ప్రారంభించారు.ఈ పర్యటనలో కైలాశానంద గిరి మహారాజ్( Kailashanand Giri Maharaj ) ఆమెకు తోడుగా ఉన్నారు.గులాబీ రంగు కుర్తా, తెలుపు దుపట్టా ధరించి, సంప్రదాయ దుస్తుల్లో లారెన్ ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.

అంతేకాదు, ఆలయ సంప్రదాయాలు, ఆచారాలలో ఆమె ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహా కుంభమేళాలో లారెన్ తన ఆధ్యాత్మిక గురువును కలవనున్నారు.తన వ్యక్తిగత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా అక్కడ ధ్యానం చేయనున్నారు.అఖాడా నిర్వహించే ‘పేషవై’ (సాధువుల ఊరేగింపు) కార్యక్రమంలో ఆమెను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తామని మహారాజ్ తెలిపారు.అయితే తుది నిర్ణయం మాత్రం లారెన్ తీసుకుంటారని స్పష్టం చేశారు.ఒక బిలియనీర్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం చాలామంది ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శకత్వంలో జీవితాన్ని ముందుకు సాగించడానికి ఇష్టపడుతున్నారని, ఈ ధోరణి పెరుగుతోందని కైలాశానంద గిరి మహారాజ్ అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగత అభివృద్ధి, ఆధ్యాత్మిక అనుభూతి కోసం చాలా మంది భారత్‌కు వస్తున్నారని వెల్లడించారు.లారెన్ రాకతో మహా కుంభమేళాకు మరింత అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube