ప్రస్తుత చలికాలంలో ఉసిరి కాయలు ( amla seeds )విరివిగా లభ్యమవుతుంటాయి.ఉసిరి కాయలు ప్రాచీన ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.
ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.అయితే ఉసిరి కాయలే గానీ.
వాటి లోపల ఉండే గింజలు ఎందుకు పనికి రావని పారేస్తుంటారు.కానీ ఇకపై ఆ పొరపాటు చేయకండి.
నిజానికి ఉసిరి గింజలు అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
మధుమేహం ఉన్న వారికి ఉసిరి గింజలు ఒక వరమని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే, ఉసిరి గింజల్లో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే గుణాలు ఉంటాయి.ఉసిరి గింజలను ఎండబెట్టి పొడి చేసి నిత్యం వాటర్ తో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సత్తా కూడా ఉసిరి గింజలకు ఉంది.వన్ టీ స్పూన్ ఉసిరి గింజల పొడిలో తేనె కలిపి తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలు( Cholesterol levels ) తగ్గుముఖం పడతాయి.ఉసిరి గింజల్లో ఉండే ఫైటోకెమికల్స్( Phytochemicals ) గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.
గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటే.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఉసిరి గింజల పొడి కలిపి తీసుకోండి.ఉసిరి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.గ్యాస్ సమస్యలు, కడుపు నొప్పి ( Gas problems, stomach pain )వంటి వాటిని తగ్గిస్తాయి.ఉసిరి గింజల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.ఉసిరి గింజలను ఎండబెట్టి పొడిచేసి నీటితో లేదా తేనెతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
శరీరానికి మంచి బలం చేకూరుతుంది.
జుట్టు ఆరోగ్యానికి ఉసిరి గింజలు అండంగా ఉంటాయి.ఉసిరి గింజల పొడిని నూనెలో కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.
జుట్టు త్వరగా తెల్లబడకుండా కూడా ఉంటుంది.ఉసిరి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుస్తాయి.
ఉసిరి గింజల పొడిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాస్తే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.