డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశంతో నిర్ణిత ఆన్లైన్ రుసుముతో లైసెన్స్ మెళకు శ్రీకారం చుట్టి మొదట దశలో 100 మందికి లైసెన్స్ లు జారీ.రెండవ దశ లైసెన్స్ మేళలో జిల్లాలో 700 వరకు యువతీ యువకులు లైసెన్స్ కోరకు దరఖాస్తు.
దశల వారిగా ఆన్లైన్ పరీక్ష అనంతరం ఉత్తీర్ణత సాధించిన వారికి లర్నింగ్ లైసెన్స్ లు,డ్రైవింగ్ లైసెన్స్ లు జారీ.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లాలోని యువతి యువకులకు జిల్లా పోలీస్ శాఖ,రోడ్ రవాణా శాఖ ఆధ్వర్యంలో రెండవ దశ లైసెన్స్ మెళ నిర్వహించగా 700 వరకు దరఖాస్తులు రావడం జరిగిందని,వారందరికీ దశల వారిగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి లర్నింగ్ లైసెన్స్ లు జారీ చేసి నెల రోజుల వ్యవధిలో డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం జరుగుతుందన్నారు.
ఈరోజు ఆర్టీవో కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన 30 మందికి లైసెన్స్ టెస్ట్ లు నిర్వహించి లర్నింగ్ లైసెన్స్ లు అందజేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
ఈరోజుల్లో ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదని,వాహనం ఉన్నా చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు.లైసెన్స్ లేకుండా వాహనం నడిపేవారికి రోడ్డు భద్రతపై అవగాహన సరిగా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.
అదేవిధంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల భారిన పడినప్పుడు వారికి వచ్చే వారికి వచ్చే ప్రమాద భీమా వర్తించదు అన్నారు.
జిల్లాలో డ్రైవింగ్ వచ్చిన వారికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో యువతి యువకులకు జిల్లా పోలీస్ శాఖ మరియు జిల్లా రోడ్ రవాణా శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మెళ నిర్వహించగా 700 దరఖాస్తులు రావడం జరిగిందని వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్ టెస్ట్ కి సబధించిన పరీక్ష పై అవగాహన కల్పించి, వారితో నిర్ణిత రుసుముతో ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేపించి ఈరోజు ఆర్టీవో కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన 30 మందికి డ్రైవింగ్ లైసెన్స్ కి ఆన్లైన్ లర్నింగ్ టెస్ట్ సంబంధించిన పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత పొందిన వారికి లర్నింగ్ లైసెన్స్ కు అందజేయడం జరిగిందని, మిగతా వారికి విడుతాల వారిగా పిలవడం జరుగుతుందని, అనంతరం వీరికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఉత్తీర్ణత అయిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ లు అందజేయడం జరుగుతున్నరు.
వాహనదారులకు విజ్ఞప్తి.
మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో మూడు సార్లు ,లేదా అంతకన్నా ఎక్కవ సార్లు పట్టుబడితే వారి లైసెన్స్ రద్దు కోసం సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిపార్సు చేయడం జరుగుతుందన్నారు.
ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, శ్రీనివాస్, డిటిఓ లక్ష్మణ్, వంశిధర్, రజిని దేవి, సిబ్బంది పాల్గొన్నారు.







