ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరికి వాస్తు శాస్త్రం (Vastu Shastra)పట్ల నమ్మకం ఉండటం సర్వసాధారణం, కానీ అది మరి హద్దులు దాటిపోతే ప్రమాదకరమవుతుంది.తాజగా బెంగళూరులో (Bangalore)ఓ వ్యక్తి తన వాస్తు పిచ్చితో తన బిల్డింగ్‌ను కూల్చుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.
బెంగళూరులో ఓ వ్యక్తి వాస్తు నిపుణుడిని కలిసాడు.ఈ క్రమంలో వాస్తు నిపుణుడి మాటలను చాచి వినిన ఇంటి యజమానుడు, “మీ ఇంటికి వాస్తు దోషం ఉంది.
ఈ పిల్లర్ ఇక్కడ ఉండకూడదు.దీన్ని తొలగిస్తే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది,” అనే మాటలను నమ్మి ఆ పిల్లర్‌ను (Pillar)తొలగించాలని నిర్ణయించుకున్నాడు యజమాని.
పిల్లర్ తొలగించే ప్రయత్నం చేయగానే, బిల్డింగ్ శిధిలావస్థకు చేరుకుని ఒక్కసారిగా అంతా కుప్పకూలింది.ఈ ఘటన ఇంటి యజమానిని ఆర్థిక నష్టానికి గురిచేయడమే కాకుండా, వాస్తు పట్ల తగిన జాగ్రత్తలు తప్పని సరి అని తెలుసుకున్నాడు.
వైరల్ వీడియో అవ్వడంతో నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందితున్నారు.
వాస్తు శాస్త్రాన్ని పాటించాలని, మరి ఇంత గుడ్డిగా మూఢనమ్మకంగా పాటిస్తే ఇలాగే ఉంటుందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే ఇలాంటి సలహా ఇచ్చిన వారిని వెంటనే జైలులో పెట్టాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఏదేమైనా ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు మామూలుగానే వాస్తు నిపుణులతో చర్చించి నిర్మించుకుంటాము.
మళ్లీ ఇల్లు కలిసి రాలేదని., ఇంకో వేరే కారణాలవల్ల ఇంటిని రూపురేఖలు మారుస్తూ అనవసరంగా కొన్నిసార్లు డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు.
అలాంటి వారికి ఈ ఘటన ఓ పరిష్కారంగా భావించవచ్చు.