మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ(Danapur Express train ,Jabalpur, Madhya Pradesh) కింద దాక్కున్న వ్యక్తి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.అతను ఇటార్సీ నుండి జబల్‌పూర్(Itarsi ,Jabalpur) వరకు దాదాపు 290 కిలోమీటర్ల ప్రయాణాన్ని రైలు బోగీ చక్రాల మధ్య వేలాడుతూ పూర్తిచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
జబల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు రోలింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో S-4 కోచ్ కింద ఒక వ్యక్తి కనిపించాడు.రైల్వే సిబ్బంది బోగీ అండర్ గేర్(Bogie under gear) తనిఖీ చేస్తుండగా, ట్రాలీలో పడి ఉన్న అతడిని గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతడిని ఆ పరిస్థితిలో చూసిన సిబ్బంది షాక్‌కు గురైన వెంటనే. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)(Railway Protection Force (RPF)) అధికారులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్ అధికారులు అతనిని బోగీ కింద నుండి బలవంతంగా బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు.
అయితే వీడియోలో ఆ వ్యక్తిని గమనించినట్లయితే, ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించింది.అతను రైలుకు కింద థ్రెడ్‌తో వేలాడుతూ ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది.అతను ఇటార్సీ నుండి రైలు ఎక్కినట్లు అంగీకరించినప్పటికీ, రైలు ట్రాలీలోకి ఎలా ప్రవేశించాడనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనకు సంబంధించి ఆర్పీఎఫ్ అధికారులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.అతని ప్రయాణం వెనుక గల కారణాలు, ఆ విధంగా ప్రమాదకర ప్రయాణం చేయడం వెనుక ఉన్న అసలు విషయాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.ఈ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.వ్యక్తి చేసిన ఈ నిర్లక్ష్యపు చర్య అతని ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం మాత్రమే కాకుండా, రైల్వే సిబ్బందిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.