నా స్నేహితుడు చిరంజీవితో నటించడం మరిచిపోలేనిది.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా మోహన్ బాబు( Mohan Babu ) పేరు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోహన్ బాబు పట్నం వచ్చిన పతివ్రతలు( Patnam Vachina Pativrathalu ) సినిమా గురించి, ఆ సినిమాకు సంబంధించిన అనుభవాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Mohan Babu Comments About Acting With Chiranjeevi Details, Mohan Babu, Chiranjee-TeluguStop.com

నా సినీ ప్రయాణంలో పట్నం వచ్చిన పత్రివ్రతలు సినిమాకు ప్రత్యేక స్థానం ఉందని మోహన్ బాబు కామెంట్లు చేశారు.ప్రతిభావంతుడైన మౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడని మోహన్ బాబు వెల్లడించారు.

ఈ సినిమాలో నటించడం, చిరంజీవితో( Chiranjeevi ) కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, చిరంజీవికి సోదరుడిగా యాక్ట్ చేయడం ఎంతో ప్రత్యేకం అనిపించిందని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.నేను ఎప్పటికీ మరిచిపోలేని సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి అని ఆయన కామెంట్లు చేశారు.మోహన్ బాబు చేసిన పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.1982 సంవత్సరంలో పట్నం వచ్చిన పతివ్రతలు మూవీ విడుదలైంది.

ఈ సినిమా విడుదలై దాదాపుగా 40 సంవత్సరాలు అయినా ఈ జనరేషన్ ప్రేక్షకులను సైతం ఈ సినిమా ఆకట్టుకుంది.మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప సినిమాలో( Kannappa Movie ) నటిస్తున్నారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.మోహన్ బాబు వయస్సు ప్రస్తుతం 72 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.మోహన్ బాబు వివాదాల నుంచి బయటపడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మోహన్ బాబు తన కొడుకుల సినిమాలు సక్సెస్ కావడం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.మనోజ్( Manoj ) కొన్ని సినిమాలలో హీరోగా నటిస్తూనే మరికొన్ని సినిమాలలో కీలక పాత్రలో నటిస్తున్నారు.మోహన్ బాబు ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం.

మోహన్ బాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube