షాకిచ్చిన ట్రంప్ .. ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ జిన్‌పింగ్‌కి ఆహ్వానం?

ప్రపంచంపై సైనిక, ఆర్ధిక, వాణిజ్య, రాజకీయంగా పట్టు సంపాదించి అమెరికాకు( America ) సవాల్ విసరాలని చైనా( China ) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ దిశలో చాలా వరకు విజయం సాధించిన డ్రాగన్.

 Donald Trump Invites Chinas Xi Jinping To His Inauguration Report Details, Donal-TeluguStop.com

ప్రబల ఆర్ధిక శక్తిగా ఎదుగుతోంది.ప్రస్తుతం నెంబర్ వన్ 1గా ఉన్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధను పక్కకునెట్టి ఆ ప్లేస్‌లో కూర్చోవాలని చూస్తోంది.

అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) రాకతో పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోయాయి.తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా దూకుడుకు ట్రంప్ కళ్లెం వేశారు.

ఈసారి కూడా తన వైఖరి ఇలాగే ఉంటుందని ఆయన ముందు నుంచే సంకేతాలు ఇస్తున్నారు.

Telugu America, China, China Xi, Donald Trump, Donaldtrump, Donald Trump Xi, Whi

అలాంటిది డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు.వచ్చే నెల 20న జరగనున్న తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను( China President Xi Jinping ) ట్రంప్ ఆహ్వానించినట్లుగా అమెరికాకు చెందిన సీబీఎస్ వార్తా సంస్ధ నివేదించింది.ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి జిన్‌పింగ్ కనుక ఈ కార్యక్రమానికి హాజరైతే కొత్త చరిత్రకు నాంది పలికినట్లే.

అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇప్పటి వరకు ఏ చైనా అధ్యక్షుడు పాల్గొనలేదు.దీనికి సాధారణంగా రాయబారులే హాజరవుతారు.అయితే 1874 నుంచి నేటి వరకు ఉన్న అమెరికా విదేశాంగ శాఖ రికార్డుల ప్రకారం ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏ విదేశీ దేశాధినేత కూడా హాజరుకాలేదు.

Telugu America, China, China Xi, Donald Trump, Donaldtrump, Donald Trump Xi, Whi

మరోవైపు.ట్రంప్ ఆహ్వానంపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఇంకా స్పందించలేదు.గత వారం ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.

తాను ఇటీవల జిన్‌పింగ్‌తో మాట్లాడినట్లు తెలిపారు.గతంలో జూన్ 2019లో జపాన్‌లో జరిగిన జీ20 సమ్మిట్( G20 Summit ) సందర్భంగా ట్రంప్ – జిన్‌పింగ్ చివరిసారిగా వ్యక్తిగతంగా కలుసుకున్నారు.2019లో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణ ఆంక్షలు చోటు చేసుకోవడం , ఇతర కారణాల నేపథ్యంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాలో పర్యటించలేదు.అయితే ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక చైనా వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube