ఉచిత వైద్య శిబిరం ప్రారంభంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)ఆధ్వర్యంలో ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొనియాడారు.రుద్రంగి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు.

 Government Whip Vemulawada Mla Adi Srinivas At The Start Of The Free Medical Cam-TeluguStop.com

ఈ సందర్భంగా ఐఎంఏ ఆద్వర్యంలో విప్ ను సన్మానించారు.అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు.

ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఉచితంగా పరీక్షలు మందులు అందజేస్తున్నారని వివరించారు.ప్రజలకు అందుబాటులోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.500 మంది పేషెంట్స్ కి సేవలు ఈ క్యాంపులో సుమారు 500 మంది పేషెంట్స్ కి రాజన్న సిరిసిల్ల ఐఎంఏ డాక్టర్ల బృందం ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చికోటి సంతోష్ కుమార్, సెక్రటరీ డాక్టర్ అభినయ్, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ లీల శిరీష, డాక్టర్ శోభారాణి, డాక్టర్ పి తిరుపతి, డాక్టర్ ఆర్ తిరుపతి, డాక్టర్ అనిత, డాక్టర్ ఆర్ ప్రవీణ్, డాక్టర్ అనంత్ బృందం ఐఎంఎ పి ఆర్ ఓ భాస్కర్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.శిబిరంలో సాధారణ వైద్య నిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, స్త్రీల సంబంధిత వైద్య నిపుణులు, ఆర్థోపెడిషన్ జనరల్ సర్జన్ వారు వైద్య సేవలు అందించారు.

ఉచిత పరీక్షలు సి బి పి, ఆర్ బి ఎస్, ఈ సి జి లాంటి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube