రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కోలనూరు శివారులో ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు వెళ్లి తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభించింది.కరీంనగర్ కు చెందిన జక్కం సాయి కృపాకర్ (19), కొలనూరుకు చెందిన గాజుల వేణి అరుణ్ (21), నూగురి సాయికృష్ణ (19) ముగ్గురు కలిసి గ్రామ శివారులో గంజాయి సేవించుటకు వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
నిందితుల వద్ద నిందితుల వద్ద 52 గ్రాముల గంజాయితోపాటు పల్సర్ బైక్ ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి ఈరోజు తేది 01-12-2024 రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు
.