వీడియో: మెరుపు వేగంతో ఢీ కొట్టిన కారు.. గాల్లో ఎగిరిపోయిన స్టూడెంట్..

ఈ రోజుల్లో చాలామంది ట్రాఫిక్ రూల్స్‌ ( Traffic rules )పాటించకుండా రోడ్లపై దూసుకెళ్తున్నారు.వీరి ర్యాష్ డ్రైవింగ్ వల్ల అమాయకులు బలవుతున్నారు.

 Student Who Was Blown Away By The Car That Hit The Video At Lightning Speed, Roa-TeluguStop.com

వాహనాలు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసేవారు ఉంటారు కాబట్టి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేకపోతే వాహనాల కింద నలిగి చనిపోవాల్సిందే.

కర్ణాటక రాష్ట్రం, బీదర్ జిల్లాలోని జిర్గా క్రాస్( Jirga Cross in Bidar District, Karnataka ) వద్ద మంగళవారం ఉదయం ఇలాంటి ఓ విషాద సంఘటనే చోటుచేసుకుంది.రోడ్డు దాటుతున్న వికాస్ సోపన్( Vikas Sopan ) అనే విద్యార్థిని అతివేగంగా వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో సదరు స్టూడెంట్ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

వీడియోలో కారు స్టూడెంట్ ను ఎంత బలంగా ఢీకొన్నదో చూడవచ్చు.ఆ డ్యాష్ ఫోర్స్‌కు విద్యార్థి గాల్లో ఎగిరిపోయాడు.

వికాస్‌ను ఢీకొన్న కారు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే ఆగకుండా అక్కడి నుంచి పారిపోయాడు.అయితే పోలీసులు ఆ వాహనదారుడిని అరెస్ట్ చేసి, ఆ కారును స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం వికాస్‌ కీలక స్థితిలో ఉన్నాడు.ఈ ప్రమాదంపై స్థానికులు తీవ్రంగా ఆగ్రహించారు.వారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.ఈ ప్రమాదానికి కారణం ‘తప్పుడు రోడ్డు నిర్మాణం’ అని ఆరోపిస్తూ తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వికాస్ కుటుంబానికి వెంటనే పరిహారం ఇవ్వాలని, ఈ ప్రాంతంలో రోడ్డు భద్రతను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులకు నచ్చచెప్పి పంపించే ప్రయత్నం చేశారు.అయితే, రోడ్ల పరిస్థితి బాగుండకపోవడంతోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు.ఈ ఘటనపై శాంతపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనతో రోడ్డు భద్రతపై ప్రజల్లో ఆందోళన పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube