వీడియో: స్లో బైక్ రేస్‌లో యువతికి, యువకుడికి టఫ్ ఫైట్.. చివరికి ఎవరు గెలిచారంటే..?

సాధారణంగా రేసుల్లో ఎవరు ముందు నిలుస్తారనేది మాత్రమే చూస్తాం.కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రేసు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండి అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

 Who Won The Tough Fight Between The Young Woman And The Young Man In The Video S-TeluguStop.com

‘గో ఫాస్ట్’( Go Fast ) అనే సాధారణ నియమానికి భిన్నంగా, ‘గో స్లో’ ( Go Slow )అనే రూల్‌తో ఈ రేసు నిర్వహించారు.దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

ఈ విచిత్రమైన స్లో బైక్ రేస్ పోటీలో ఒక యువతి స్కూటీపై, యువకుడు బైక్‌పై పోటీ పడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఖాళీ స్థలంలో రేసు ట్రాక్‌ను ఏర్పాటు చేసి, చుట్టూ జనాలను కూర్చోబెట్టి ఈ ఆటను ఎంజాయ్ చేశారు.

స్లో బైక్ రేస్‌లో స్కూటీ నడుపుతున్న యువతే గెలిచింది.కానీ, ఆమె గెలుపును చాలా మంది అంగీకరించడం లేదు.స్కూటీని ( Scooty )బైక్‌ కంటే నెమ్మదిగా నడపడం చాలా సులభమని నెటిజన్లు కూడా అంటున్నారు.బైక్ లాగా స్కూటీని బ్యాలెన్స్ చేయడానికి క్లచ్‌ని ఉపయోగించాల్సిన అవసరం లేదు కాబట్టి, ఈ రేసులో న్యాయం లేదని వాదిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ వీడియోను ఇప్పటికే 2.5 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు చూశారు, 44 వేల మంది లైక్ చేశారు.కామెంట్ల సెక్షన్‌లో ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ రచ్చ చేస్తున్నారు.“రెండు వాహనాలు వేరే వేరేవి కాబట్టి ఈ రేసు ఫెయిర్ కాదు” అని ఒకరు అంటే, “క్లచ్ ఉన్న బైక్‌ని, క్లచ్ లేని స్కూటీని పోల్చడం సరికాదు” అని మరొకరు అంటున్నారు.

వేగంగా వెళ్లే బైక్ రేసులతో పోల్చితే ఈ స్లో బైక్ రైసు చాలా మంచిది అని కొంతమంది అన్నారు.ఇది సరదాగా ఉండటమే కాకుండా ఎవరికి ఎలాంటి హాని జరగదు అని కూడా పేర్కొంటున్నారు.కొద్ది రోజుల క్రితం ఒక యువకుడు తన బైక్‌ని బాగా నడుపుతుంటే, అతని వెనుక వస్తున్న మరో యువకుడు, యువతి తమ కేటీఎం డ్యూక్ బైక్‌తో రేసు పెట్టాలని అడిగారు.హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ, ఆ యువకుడు రోడ్డు నియమాలను పట్టించుకోకుండా, ఇతర వాహనాలను అతిక్రమించి వేగంగా ప్రయాణించాడు.

కొంత దూరం వెళ్లిన తర్వాత, ఖాళీ రోడ్డులో అమ్మాయితో కలిసి వెళుతున్న యువకుడు తన బైక్‌తో స్టంట్ చేసే ప్రయత్నం చేశాడు.ఈ విషయం తెలియని యువతి బ్యాలెన్స్ కోల్పోయి బైక్ నుంచి కింద పడబోయింది.

అదృష్టవశాత్తు ఆమెకి ఏమీ జరగలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube