వట్టి చేతులతో రాకాసి బల్లిని పట్టుకున్న మహిళ.. చివరికి ఏమైందో చూస్తే షాకే..

సాధారణంగా కరిచేసే జీవుల దగ్గరికి వెళ్లాలంటేనే చాలా మంది భయపడతారు.వాటిని పట్టుకునే సాహసం ఎవరూ చేయరు కానీ ఛత్తీస్‌గఢ్( Chhattisgarh ) రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌కు చెందిన అజితా పాండే అనే మహిళకు భయం అంటే ఏంటో తెలియనట్లుంది.

 The Woman Who Caught The Lizard With Her Bare Hands Will Be Shocked To See What-TeluguStop.com

ఈ ధైర్యవంతురాలు ఒక పెద్ద రాకాసి బల్లిని ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఒక ఇంటి నీటి ట్యాంక్‌లో పడిపోయిన మాన్‌స్టర్ లిజార్డ్‌ను ( Monster Lizard )తన చేతులతోనే పట్టుకుని కాపాడుతున్న ఆమె వీడియో లక్షలాది మందిని ఆకట్టుకుంది.

ఒక ఇంటి నీటి ట్యాంక్‌లో బల్లి పడిపోయిందని అజితాకు ఫోన్ వచ్చింది.వెంటనే అక్కడికి చేరుకున్న ఆమె ఒక రాడ్‌తో బల్లిని ట్యాంక్‌ నుంచి జాగ్రత్తగా బయటకు తీసింది.

ఆ తర్వాత బల్లి తోకను తన చేతితో పట్టుకుని దానిని సురక్షితంగా బావి నుంచి పక్కకి తీసింది.

అజితా పాండే బల్లిని రక్షిస్తున్న సమయంలో, బల్లు ఆమెపై రెండుసార్లు దాడి చేయడానికి ప్రయత్నించింది.అయినప్పటికీ, అజితా చాలా ధైర్యంగా, కామ్ గా ఉండి, తనను తాను లేదా బల్లికి ఏమాత్రం గాయపరచకుండా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసింది.ఆమె ధైర్యం, ప్రశాంతత చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.

ఈ రెస్క్యూ వీడియోను 4 కోట్లకు పైగా మంది వీక్షించారు.చాలామంది ఆమె ధైర్యాన్ని, నైపుణ్యాలను ప్రశంసిస్తూ ఉండగా, మరికొందరు ఇలాంటి రెస్క్యూ పనుల సమయంలో సేఫ్టీ గేర్ ధరించాలని సలహా ఇచ్చారు.

అజిత ఈ ఏడాది ప్రారంభంలో, బిలాస్‌పూర్‌లోని( Bilaspur ) ఒక ఆఫీస్‌ నుంచి పామును రక్షిస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది.అప్పుడు కూడా తన చేతులతోనే పామును పట్టుకుని రక్షించింది.అజిత ఒక నర్స్ కూడా.ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన రెస్క్యూ వీడియోలను పంచుకుంటుంది.ఆమెకు లక్ష మందికి పైగానే ఫాలోవర్లు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube