స్వర్గలోకపు వృక్షం పారిజాతం ఆరోగ్య ర‌హ‌స్యాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం!

పూల వృక్షాల్లో పారిజాతానికి( Parijat ) ప్ర‌త్యేక స్థానం ఉంది.సాధార‌ణంగా పూలు నెల‌రాలితే పూజ‌కు ఉప‌యోగించ‌రు.

 Incredible Health Benefits Of Parijata Tree! Parijatham Flowers, Parijata Tree,-TeluguStop.com

కానీ పారిజాతం పూల‌ను మాత్రం పొర‌పాటును కూడా చెట్టు నుంచి తెంప‌రు.నెల‌రాలిన‌ పూల‌నే పూజ‌కు వినియోగిస్తారు.

తెలుపు, నారింజ వర్ణంలో ఎంతో ఆహ్లాదకరంగా క‌నిపించే పారిజాతం పూలు చ‌క్క‌ని సువాసనలు గుప్పిస్తుంటాయి.అయితే పూల‌న్నింటిలో పారిజాతం వేరు.

మిగ‌తా పూల మొక్క‌ల‌న్ని భూమిపై పుట్టిన‌వే.కానీ పారిజాతం చెట్టును మాత్రం శ్రీకృష్ణుడు స్వ‌ర్గం నుంచి తీసుకొచ్చాడ‌ని పుర‌ణాలు చెబుతున్నాయి.

అందుకే పారిజాతాన్ని దేవతా వృక్షమ‌ని, స్వర్గలోకపు వృక్షమ‌ని కూడా పిలుస్తారు.

ఇక‌పోతే పారిజాతం వృక్షంలో ఎన్నో ఆశ్చ‌ర్య‌పోయే ఆరోగ్య ర‌హ‌స్యాలు దాగి ఉన్నాయి.

ఈ చెట్టు పూలు, ఆకులు, బెర‌డ‌ను ఆయుర్వేద‌ వైద్యంలో వివిధ రోగాల‌కు ( diseases )నివార‌ణిగా ఉప‌యోగిస్తారు.పారిజాతం చెట్టు బెర‌డుకు జ్వ‌రాన్ని హ‌రించే గుణాలు ఉన్నాయి.

చెట్టు బెరడును తీసి నీటిలో వేసి మరిగిస్తే మంచి క‌షాయం త‌యార‌వుతుంది.ఈ క‌షాయాన్ని రోజుకు రెండు సార్లు తాగితే జ్వ‌రం ప‌రార్ అవుతుంది.

సాధార‌ణ జ్వ‌ర‌మే కాకుండా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా( Malaria, Dengue, Chikungunya ) వంటి విష జ్వ‌రాలు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

Telugu Tips, Latest, Jasmine, Parijata Tree, Parijatham Tree-Telugu Health

జ‌లుబు, ద‌గ్గుతో( cold and cough ) బాధ‌ప‌డేవారికి పారిజాతం ఆకులు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.ఈ ఆకుల‌తో టీ త‌యారు చేసుకుని తీసుకుంటే జ‌లుబు, నిరంతరం దగ్గు, గొంతు సంబంధిత సమస్యల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.అలాగే జీర్ణ ఆరోగ్యానికి పారిజాతం పూలు ఎంతో మేలు చేస్తాయి.

ఈ పూల‌ను నీటిలో వేసి మ‌రిగించి ప్ర‌తిరోజూ ఉద‌యం తాగితే గ్యాస్‌, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.

Telugu Tips, Latest, Jasmine, Parijata Tree, Parijatham Tree-Telugu Health

పారిజాత పూల క‌షాయాన్ని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీ సంబంధమైన అనేక అనారోగ్య సమస్యలు దూర‌మ‌వుతాయ‌ని అంటున్నారు.కీళ్ల‌నొప్పుల‌తో బాధ‌ప‌డేవారు పారిజాత చెట్టు కొమ్మని ముక్కలుగా చేసి ఎండ‌బెట్టి పొడి చేసుకుని స్టోర్ చేసుకోవాలి.ఈ పొటిని రోజుకు ఒక టీ స్పూన్ చొప్పున గ్లాస్ వాట‌ర్ లో క‌లిపి తాగితే కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube