కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ( Suriya ) కంగువ సినిమా ( Kanguva Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా నవంబర్ 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్న నేపథ్యంలో సూర్య దేశవ్యాప్తంగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ముంబైలో ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సూర్య మీడియా( Media) కు క్షమాపణలు తెలియచేశారు.
ఇలా సూర్య మీడియాకు క్షమాపణలు చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి అసలు ఎందుకు ఈయన క్షమాపణలు చెప్పారనే విషయానీకి వస్తే.అనుకున్న సమయానికంటే సూర్య ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి అరగంటకు పైగా ఆలస్యంగా వచ్చారు.దీంతో తనకోసం ఎదురు చూస్తున్న మీడియా బృందానికి ఈయన క్షమాపణలు చెప్పారు.
ట్రాఫిక్ కారణంగా ఆలస్యమైంది అనే కుంటి సాకులు తాను చెప్పనని, మీ అందరి సమయానికి నేను విలువనిస్తాను.నేను దీన్ని నియంత్రించలేకపోయాను అంటూ మీడియాకు క్షమాపణలు చెప్పారు.
ఇక కంగువ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే సూర్య పార్ట్ 2 గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.మీరందరూ ప్రస్తుతం ఈ సినిమా కోసం ఎలా అయితే ఎదురు చూస్తున్నారో తాను కూడా పార్ట్ 2 కోసం అంతే ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.ఈ సినిమా క్లైమాక్స్ లో ఎన్నో ట్విస్టులతో కూడిన ప్రశ్నలు తలెత్తుతాయని అయితే వాటన్నిటికీ పార్ట్ 2 లో సమాధానం దొరుకుతుందని ఈ సందర్భంగా సూర్య తెలియజేశారు.
కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా కొనసాగుతుంది.ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు.ఇక ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించగా బాబీడియోల్ విలన్ పాత్రల సందడి చేయనున్నారు.