సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) మేనల్లుడుగా అశోక్ గల్లా( Ashok Galla ) గత రెండు సంవత్సరాల క్రితం హీరో అనే సినిమా ద్వారా ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.ప్రముఖ రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ ( Jayadev Galla ) కుమారుడిగా ఈయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఇలా హీరో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక్ గల్లా తాజగా రెండో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.దేవకీ నందన వాసుదేవ ( Devaki Nanda Vasudeva ) అనే సినిమాతో రాబోతున్నాడు.
ఈ సినిమా నవంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇలా ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అత్తయ్య నమ్రత ( Namrata ) గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా నమ్రత గురించి అశోక్ మాట్లాడుతూ నమ్రత అత్త చాలా సపోర్టివ్ గా ఉంటారు.
నేను ఇండస్ట్రీలోకి వస్తే ఎలా ఉండాలి.ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాల గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు.

నేను హీరోగా వద్దామనుకునే ముందు బాగా జుట్టు పెంచి పోర్ట్ ఫోలియో(ఆడిషన్ ఫొటోలు) తీయించుకుందాం అనుకున్నాను.సింపుల్ గా చెన్నై వెళ్లి తీసుకుందాం అనుకున్నాను కానీ నమ్రత అత్త మాత్రం ముంబై వెళ్లి హెయిర్ స్టైలింగ్ చేయించుకొని ప్రాపర్ అఫీషియల్ పోర్ట్ ఫోలియో చేపించమని సలహా ఇవ్వడమే కాకుండా నాకు సపోర్ట్ కూడా చేసింది.ఒక మాటలో చెప్పాలి అంటే నేను హీరోగా ఇండస్ట్రీలోకి రావడానికి నమ్రత అత్త కారణం అంటూ అశోక్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








