ముఖ్యమంత్రి తమ్ముడి పేరు చెప్పి బెదిరిస్తున్నారంటున్న మహిళ.. వీడియో వైరల్‌

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) మరో షాక్ తగిలింది.ముఖ్యమంత్రి తమ్ముడు పేరు చెప్పి ఓ రెండు అడ్వర్టైజింగ్ కంపెనీలు నన్ను బెదిరిస్తున్నాయని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

 Woman Being Threatened In The Name Of Cm Revanth Reddy Brother Video Viral Detai-TeluguStop.com

దీనిపై ఘటన బాధితుడి భార్య ఓ వీడియోను సొసైల్ మీడియాలోకి వదిలింది.రేవంత్ రెడ్డి తమ్ముడు( Revanth Reddy Brother ) పేరు చెప్పి నాలుగు నెలలుగా రెండు అడ్వర్టైజింగ్ కంపెనీలు బెదిరిస్తున్నాయంటూ ఓ చిన్న అడ్వర్టైజింగ్ కంపెనీ( Advertising Company ) నడుపుతున్న ఓ మహిళ వీడియో పోస్ట్ చేసింది.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మున్సిపాలిటీల్లో ( Municipalities ) ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డులను అక్రమంగా తొలగించి వారి బోర్డులను పెట్టుకుంటున్నారని మహిళా తెలిపింది.ఇదేమిటని ప్రశ్నించగా.సీఎం సోదరుడు పేరు చెప్పి ఇంత అరాచకం సృష్టిస్తామని ఆమె అన్నారు.ఇలాగే కొనసాగిస్తే.కబ్జా చేస్తామని, మా ఇష్టమని.

సమాధానం ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది మహిళ.గత కొద్దిరోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి.

ఇందులో ఎక్కువగా రాజకీయ నాయకులు వారి శృంగార లీలలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి.మరికొందరు, రాజకీయ నాయకులు తమను వేధిస్తున్నామంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా వారి ఇబ్బందులను తెలియజేశారు.తాజాగా ఈ వీడియో కూడా ఈ వర్గానికి చెందిందే.ఏదేమైనా ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా ధైర్యంగా ఇలా తన బాధను వ్యక్తపరిచిందంటే అక్కడ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube