సాధారణంగా ఒక్కోసారి జుట్టు కుదుళ్ళు( Hair Roots ) బలహీనంగా మారిపోతూ ఉంటాయి.అలాంటి సమయంలో హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది చాలా అధికంగా ఉంటుంది.
కనీసం పట్టుకున్న కూడా ఊడిపోతుంది.మీరు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ అండ్ న్యాచురల్ టానిక్ ను వారానికి ఒక్కసారి కనుక వాడితే లాగిన కూడా మీ జుట్టు ఊడదు.
టానిక్ తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు,( Ginger ) నాలుగు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పదార్థాలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
దాంతో మన టానిక్ అనేది రెడీ అవుతుంది.
స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో టానిక్ ను ఫిల్టర్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఇప్పుడు ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట లేదా గంటన్నర అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను కనుక వాడితే జుట్టు కుదుళ్ళు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం సమస్య తగ్గు ముఖం పడుతుంది.అలాగే ఈ టానిక్ చుండ్రును సంపూర్ణంగా నివారిస్తుంది.స్కాల్ప్ ను హెల్తీ గా మారుస్తుంది.అంతేకాకుండా ఈ టానిక్ ను వాడటం అలవాటు చేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.తెల్ల జుట్టు సమస్య సైతం త్వరగా దరిచేరకుండా ఉంటుంది.