తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకులు( Directors ) చాలామంది ఉన్నారు.అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )ఒకరు… ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో రైటర్ గా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా కూడా సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రూపొందుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా నిర్మాత అయిన నాగ వంశీ( Naga Vamsi ) ఈ సినిమా మీద పలు రకాల కామెంట్లైతే చేశాడు.ఇక ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్ల వరకు బడ్జెట్( 600 crore budget ) ను కేటాయిస్తున్నట్లు గా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ రేంజ్ లో కలెక్షన్స్ ను వసూలు చేస్తాడు అంటూ కొన్ని ఊహాగానాలైతే వ్యక్తమవుతున్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తే మాత్రం త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా మీద భారు అంచనాలు ఉండడమే కాకుండా ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కూడా పాన్ ఇండియాలో తన సత్తా చాటు కుంటాడా లేదా అనే విషయాల మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాతో తన సత్తా చాటుకొని మరోసారి పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు…
.







