యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ (Junior NTR ,Koratala Siva)కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమా రిజల్ట్ విషయంలో అభిమానులు సైతం సంతోషంగా ఉన్నారు.బాక్సాఫీస్ వద్ద 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో (OTT)సైతం అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంటోంది.
ఓటీటీలో ఈ సినిమా ఏకంగా నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం.
ఓటీటీలో దేవర మూవీ రిజల్ట్ ఏంటనే ప్రశ్నకు సులువుగానే సమాధానం దొరికిందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర రిజల్ట్ (Devara Result)విషయంలో అభిమానులు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారు.నెట్ ఫ్లిక్స్ (Netflix )లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ ఈ సినిమాకు సొంతమవుతున్నాయి.థియేటర్లలో ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఓటీటీలో మరికొన్ని రోజుల పాటు దేవర హవా కొనసాగే ఛాన్స్ అయితే ఉంది.ఓటీటీ వెర్షన్(OTT version) లో దావూదీ సాంగ్ ను సైతం యాడ్ చేయడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేవర సినిమాకు రిపీట్ వాల్యూ ఎక్కువగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

నెట్ ఫ్లిక్స్ ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి న్యాయం జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.కొంతమంది సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నా ఈ సినిమాను చూసేవాళ్ల సంఖ్య తగ్గడం లేదు.దేవర సీక్వెల్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది.