అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన యూఎస్ యువతి.. కట్ చేస్తే..?

టెక్సాస్‌కు( Texas ) చెందిన 21 ఏళ్ల యువతి ఏ తల్లి చేయని ఒక చెత్త పనిచేసింది.ఆమె పేరు జునిపెర్ బ్రైసన్.

 Us Woman Arrested For Attempting To Sell Her Newborn Baby Online Details, Junipe-TeluguStop.com

( Juniper Bryson ) ఇటీవల ఈ యువతి తన పసిబిడ్డను ఫేస్‌బుక్‌లో ( Facebook ) అమ్మకానికి పెట్టింది.బిడ్డ పుట్టిన కొన్ని గంటలకే ఆమె ఈ దారుణానికి పాల్పడింది.

ఆమె ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌లో తన బిడ్డను దత్తత తీసుకోవాలంటూ ఓ పోస్ట్ చేసింది.చాలా కపుల్స్, సేమ్-జెండర్ కపుల్స్ ఆ బిడ్డను దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపించారు.

తన బిడ్డకు దత్తత తల్లిదండ్రులను వెతుకుతున్నానని చెప్పి, ఆ బిడ్డ ఫోటోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది.దత్తత( Adoption ) విషయంలో తను ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పింది.

ఆ బిడ్డకు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేసింది.బిడ్డ దక్కాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని తన పోస్ట్‌లో స్పష్టంగా పేర్కొంది.

Telugu Baby Sale, Child, Juniper Bryson, Exchange, Nri-Telugu NRI

బ్రైసన్‌కి ఆ డబ్బు అడగడానికి చెప్పిన కారణాలు కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి.తాను ఒక అపార్ట్‌మెంట్‌కు మారాలని, ఒక ఉద్యోగం సంపాదించాలని లేదా ఒక ఇల్లు కొనడానికి డౌన్‌పేమెంట్ చేయాలని కోరుకుంటుందట.తనకు పెద్దగా డబ్బు అవసరం లేదని, కేవలం ఒక ఇల్లు, ఉద్యోగం సంపాదించే తన కూతుర్ని తిరిగి తీసుకోవడానికి సరిపడా డబ్బులు కావాలని చెప్పింది.డూర్‌డాష్ డెలివరీలు చేయడానికి ఒక కారు కొనడానికి డబ్బులు సమకూర్చిన సరిపోతాయని పేర్కొంది.

Telugu Baby Sale, Child, Juniper Bryson, Exchange, Nri-Telugu NRI

ఈ విషయం తెలుసుకున్న ఏడు కుటుంబాలు ఆ బిడ్డను( Baby ) దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాయి.వారిలో ఒక కుటుంబం ఆ బిడ్డను తీసుకురావడానికి 300 మైళ్లు ప్రయాణించింది కూడా.కానీ జునిపెర్ వారిని డబ్బు అడగడంతో వారు తిరిగి వెళ్లిపోయారు.వెండీ విలియమ్స్ అనే స్థానిక మహిళ ఆ బిడ్డను దత్తత తీసుకోవాలని ముందే నిర్ణయించుకుంది.జునిపెర్ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆమె ఆసుపత్రికి వెళ్లి జునిపెర్‌తో కలిసి ఉంది.కొంతకాలం ఆ బిడ్డతో గడిపిన తర్వాత చట్టబద్ధంగా తనతో ఉంచుకోవాలని వెండీ ప్లాన్ చేసింది.

అయితే, జునిపెర్ ఫేస్‌బుక్ పేజీ నుండి వెండీకి కొన్ని అనుమానాస్పద సందేశాలు వచ్చాయి.వెండీ వాటి గురించి జునిపెర్‌ను అడిగితే, జునిపెర్‌ ఆమెను ఆసుపత్రి నుండి బయటకు పంపించింది.ఆ బిడ్డను అమ్ముతున్నారని అనుమానించి వెండీ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్‌కు( Child Protection Services ) ఫిర్యాదు చేసింది.“ఆ బిడ్డను మాకు దొరకకపోవడం కంటే, దాని భద్రతే ముఖ్యమైన విషయం కాబట్టి నాకు చాలా బాధ కలిగింది” అని వెండీ చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube