అమెరికా అధ్యక్ష పీఠం దిశగా డొనాల్డ్ ట్రంప్.. కమలకు దెబ్బేసిన స్వింగ్ స్టేట్స్

యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( US Presidential Elections ) రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) విజయం దిశగా దూసుకెళ్తున్నారు.అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.

 Us Elections 2024 Donald Trump Gains An Edge Over Kamala Harris In Neck-and-neck-TeluguStop.com

మెజారిటీ మార్కు 270.ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ 248 ఓట్లతో విజయానికి అడుగు దూరంలో నిలవగా.డెమొక్రాటిక్ అభ్యర్ధి కమలా హారిస్( Kamala Harris ) 214 ఓట్ల వద్దే ఉన్నారు.దీంతో దేశవ్యాప్తంగా రిపబ్లికన్ మద్ధతుదారులు రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకుంటున్నారు.

Telugu Democratic, Donald Trump, Georgia, Kamala Harris, Carolina, Pennsylvania,

అధ్యక్ష ఎన్నికల్లో విజయాలను శాసించే ఏడు స్వింగ్ స్టేట్స్‌ మొత్తం ట్రంప్ వైపే మొగ్గు చూపడంతో ఆయన పని సులువైంది.ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ట్రంప్ మూడు రాష్ట్రాల్లో గెలుపొందారు.అవి పెన్సిల్వేనియా,( Pennsylvania ) జార్జియా,( Georgia ) నార్త్ కరోలినా.మరో నాలుగు స్వింగ్ స్టేట్స్ అయిన విస్కాన్సిన్, మిచిగన్, అరిజోనా, నెవాడాలలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.

దీంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఆయన బాధ్యతలు చేపట్టడం దాదాపు లాంఛనమేనని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Telugu Democratic, Donald Trump, Georgia, Kamala Harris, Carolina, Pennsylvania,

మరోవైపు.అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి( Republican Party ) సానుకూల ఫలితాలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.తన సతీమణి మెలానియా, కుమారుడు బారన్‌తో కలిసి వేదికపైకి వచ్చిన ట్రంప్‌కు రిపబ్లికన్లు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.ఇలాంటి విజయాన్ని అమెరికా గతంలో ఎన్నడూ చూడలేదని, దేశానికి స్వర్ణ యుగం రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు పోరాడారని, ఇకపై ప్రతి క్షణం దేశం కోసం పోరాడుతానని ట్రంప్ స్పష్టం చేశారు.మరోవైపు ఎన్నికల్లో ఓటమి దిశగా పయనిస్తుండటంతో డెమొక్రాట్ పార్టీ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.

హోవర్డ్ యూనివర్సిటీ వాచ్ పార్టీలో కమలా హారిస్ ప్రసంగించాల్సి ఉంది.కానీ ఆమె తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లుగా కమలా హారిస్ ప్రచార బృందం ఓ ప్రకటనలో తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube