సాధారణంగా పోటీ పరీక్షలలో మంచి మార్కులు సాధించడం అనేది ఎంతోమంది విద్యార్థుల కల అనే సంగతి తెలిసిందే.ఏపీ టెట్ పరీక్ష ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి.ఈ పరీక్ష ఫలితాలలో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు అశ్విని 150కు 150 మార్కులు సాధించారు.2014 – 2016 మధ్య అశ్విని డైట్ పూర్తి చేశారు.వరుసగా ఐదు టెట్ ల కోసం ఆమె పోటీ పడటం గమనార్హం.
తల్లీదండ్రులు వెంకటలక్ష్మి, కె.శంకరరావు ఎంతో ప్రోత్సహిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.డీఎస్సీ సాధించడమే తన లక్ష్యమని అశ్విని చెప్పుకొచ్చారు.రాబోయే రోజుల్లో అశ్విని తన కలను కచ్చితంగా నెరవేర్చుకుంటారని మరిన్ని విజయాలను ఆమె సొంతం చేసుకుంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.పేపర్1 ఎస్జీటీలో ప్రతిభ చాటుకున్న ఆమె టాలెంట్ ను నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు.
టెట్ పరీక్షలో అశ్విని మంచి మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది.ఏపీ టెట్ పరీక్షలో మెరిసిన అశ్వినిని నెటిజన్లు సైతం ఎంతగానో మెచ్చుకుంటున్నారు.అశ్విని తన టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకున్నారు.టాప్ లో నిలిచిన అశ్వినికి ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లభిస్తే బాగుంటుందని చెప్పవచ్చు.
కొండ్రు అశ్విని తండ్రి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.కొండ్రు అశ్విని సాదించిన సక్సెస్ ను చూసి ఆమె తల్లీదండ్రులు మురిసిపోతున్నారు.టెట్ పరీక్షలో ఎంతోమంది యువతులు ప్రతిభ చాటారు.అశ్వినికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఏపీలో త్వరలో డీఎస్సీ పరీక్షలు సైతం జరగనున్నాయి.ఈ పరీక్షల కోసం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పోటీ పడుతున్నారు.
గతంలో జరిగిన డీఎస్సీ పరీక్షలతో పోల్చి చూస్తే ఈసారి జరిగే పరీక్షకు ఒకింత గట్టి పోటీ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.