ఆ తేదీన విడుదల కానున్న చైతన్య తండేల్.. బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!

అక్కినేని అందగాడు నాగచైతన్య(naga chaitanya) సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.క్లాస్ సినిమాలతో చైతన్య భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది.

 Naga Chaitanya Thandel Movie Release Date Fixing Details Inside Goes Viral In So-TeluguStop.com

అయితే గత కొన్నేళ్లుగా నాగచైతన్యకు కెరీర్ పరంగా కలిసిరావడం లేదు.బంగార్రాజు సినిమాకు ముందు వెనుక చైతన్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ(Thank you, Lal Singh Chadha, custody) సినిమాలు ఒక సినిమా తర్వాత మరొకటి విడుదలై ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేశాయి.ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మిగిల్చాయి.

అయితే తండేల్ (thandel )సినిమాతో చైతన్య కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ కచ్చితంగా దక్కే ఛాన్స్ అయితే ఉంది.ఈ సినిమాపై అంచనాలు కూడా మామూలుగా లేవనే సంగతి తెలిసిందే.

Telugu Christmas, Dil Raju, Maha Shivratri, Naga Chaitanya, Nagachaitanya, Sankr

అయితే నాగచైతన్య తండేల్(naga chaitanya thandel) కు మిగిలిన ఏకైక ఆప్షన్ ఏదనే ప్రశ్నకు ఫిబ్రవరి నెల అని సమాధానంగా వినిపిస్తుంది.ఫిబ్రవరి నెలలో ఇప్పటికే దిల్ రాజు(Dil Raju ) నిర్మించిన తమ్ముడు మాత్రమే షెడ్యూల్ అయింది.ఆ సినిమా మహా శివరాత్రి(Maha Shivratri) కానుకగా రిలీజ్ కానుంది.అయితే టాక్ అద్భుతంగా ఉంటే ఫిబ్రవరి, మార్చి నెలలలో విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమాలు ఉన్నాయి.

ఫిబ్రవరిలో తండేల్ విడుదలైతే థియేటర్ల విషయంలో సైతం ఇబ్బందులు ఎదురుకావు.ఫిబ్రవరి నెల 7వ తేదీన తండేల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

Telugu Christmas, Dil Raju, Maha Shivratri, Naga Chaitanya, Nagachaitanya, Sankr

క్రిస్మస్, సంక్రాంతి(Christmas, Sankranti) సీజన్లను వదులుకున్న తండేల్ ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ ను షేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది.నాగచైతన్య మార్కెట్ ను మించి ఖర్చు చేస్తుండగా కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉంటాయో లేదో చూడాల్సి ఉంది.తండేల్ రిలీజ్ డేట్ ను ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube