యూట్యూబర్ గా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న హర్షసాయికి( Harsha Sai ) ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు.హర్షసాయి చేసిన సహాయాల వల్ల ఎంతోమంది జీవితాలు మారిపోయాయి.
కష్టాల్లో ఉన్న ఎంతోమందిని హర్షసాయి ఆదుకున్నాడు.హర్షసాయి యూట్యూబ్ వీడియోలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చేవి.
హర్షసాయి సంపాదన గురించి కొన్ని యాప్స్ ప్రమోషన్స్ గురించి కొంతమంది విమర్శలు చేశారు.
ఒక యువతి హర్షసాయి తనపై లైంగికంగా దాడి చేశాడని మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఈ కేసు విషయంలో తాజాగా హర్షసాయికి బెయిల్( Bail ) మంజూరైంది.తాజాగా హైదరాబాద్( Hyderabad ) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమైన హర్షసాయి తనపై నమోదైన కేసు గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

నా గురించి కావాలనే తప్పుడు ప్రచారం చేశారని హర్షసాయి పేర్కొన్నారు.నేను తీసిన సినిమాకు వాళ్లే కాపీరైట్స్ ఇవ్వాలని అడగటంతో పాటు 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.నేను డబ్బును ప్రజలకు అయితే ఇస్తాను కానీ బ్లాక్ మెయిల్( Black Mail ) చేసేవారికి అసలే ఇవ్వనని తెలిపారు.నిజాలు బయటికొచ్చాయి కాబట్టే నాకు బెయిల్ మంజూరు అయిందని హర్షసాయి తెలిపారు.

మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని అంటారని హర్షసాయి చెప్పుకొచ్చారు.హర్షసాయి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.హర్షసాయి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.హర్షసాయి ఫస్ట్ మూవీ ఆగిపోయినట్టేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.హర్షసాయి సినిమాలతో బిజీ అవుతారో లేక యూట్యూబ్ కు ప్రాధాన్యత ఇస్తారో చూడాల్సి ఉంది.ఈ కేసు నుంచి హర్షసాయి పూర్తిస్థాయిలో బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
హర్షసాయిని అభిమానించే వాళ్లు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.