ఈ మధ్య సెలబ్రిటీలు తమ కామెంట్ల ద్వారా వివాదాలలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.ప్రముఖ నటి కస్తూరి( Actress Kasturi ) మాట్లాడుతూ 300 సంవత్సరాల క్రితం అంతఃపురంలో మహిళలకు సేవ చేయడానికి తెలుగువారు తమిళనాడుకు వచ్చారంటూ కామెంట్స్ చేశారు.
ఈ కామెంట్లు అటు తమిళనాడులో( Tamil Nadu ) ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కాగా ఈ కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ కామెంట్స్ తన దృష్టికి రావడంతో కస్తూరి రియాక్ట్ అయ్యి వివాదాన్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు.
తెలుగు నా మెట్టినిల్లు అని తెలుగువారంతా నా కుటుంబం అని ఆమె అన్నారు.ఇది తెలియని వాళ్లు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కస్తూరి పేర్కొన్నారు.
తెలుగువారు ఎంతోమంది నాపై ప్రేమాభిమానాలను చూపిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
తమిళ మీడియాలో నా కామెంట్లను వక్రీకరిస్తూ వస్తున్న వార్తలను తెలుగు ప్రజలు నమ్మొద్దని కోరుతున్నానని కస్తూరి తెలిపారు.డీఎంకే పార్టీ( DMK Party ) నా కామెంట్లను వక్రీకరిస్తోందని ఆమె అన్నారు.ఇలా నాపై నెగిటివిటీ తీసుకొచ్చి నన్ను భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని కస్తూరి పేర్కొన్నారు.
నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ విష ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు.
అయితే కస్తూరి తాను ఏం మాట్లాడారో చెప్పి ఈ వివరణ ఇస్తే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కస్తూరి వివరణతో తెలుగు వాళ్లు కూల్ అవుతారా అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.కస్తూరి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
కస్తూరి కామెంట్లు వివాదాస్పదం అవుతుండగా ఈ వివాదంకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.ఈ వివాదాల వల్ల కస్తూరికి ఆఫర్లు తగ్గే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కస్తూరి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.