టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా భారీ సక్సెస్ ని సాధించడానికి మన స్టార్ హీరోలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి అనేది ఇప్పుడు తారాస్థాయికి వెళ్లిపోయిందనే చెప్పాలి.
పాన్ ఇండియా (Pan India) రేంజ్ లో మన ఇండస్ట్రీ ని మించిన ఇండస్ట్రీ మరొకటి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఏది ఏమైనా కూడా మన వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడంలో మాత్రం చాలా వరకు ముందు వరుసలో ఉన్నారు.
ఇక ప్రస్తుతం తమదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ (Prabhas, Ram Charan, NTR)లాంటి హీరోలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతున్నారనే చెప్పాలి.ఇక ప్రస్తుతం మిగతా భాషల్లో ఉన్న దర్శకులందరూ ఈ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఈ ముగ్గురు కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక పాన్ ఇండియా వైడ్ (Pan India WidePan India Wide)గా తమ సత్తా చాటుకున్న ఈ హీరోలు సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.
కాబట్టి ఈ ముగ్గురితో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరూ ఉత్సాహాన్ని చూపిస్తుండడం విశేషము.
ఇక ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా దాదాపు రెండు మూడు సినిమాలకు కమిట్ అయి ఉన్నారు.కాబట్టి ఇతర భాషల దర్శకులు చెప్పే కథలను వినే టైమ్ లో లేనట్టుగా తెలుస్తుంది.ఒకవేళ విన్నా కూడా ఆ సినిమాలు చేయడానికి మరో మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పట్టే అవకాశమైతే ఉంది… ఇక మొత్తానికైతే తెలుగు హీరోల కోసం మిగతా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు వెయిట్ చేసే రోజు రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…
.