ప్రారంభానికి పీ.హెచ్.సీ. సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) చందుర్తి మండల కేంద్రంలో పీ హెచ్ సీ నూతన భవన తుది దశ పనులు పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.చందుర్తిలో రూ.1 కోటి 56 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టగా, కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా భవనంలోని అన్ని గదులు, ఆవరణను పరిశీలించారు.

 Initially Phc. To Be Prepared By : District Collector Sandeep Kumar Jha , Phc-TeluguStop.com

దవాఖాన ఆవరణను మొత్తం శుభ్రం చేయించాలని ఎంపీడీఓను ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

భవనంలో తుది దశ పనులను త్వరగా పూర్తి చేసి, ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

పాత భవనం నుంచి నూతన భవనంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యాధికారి సంపత్ కు సూచించారు.

విద్యార్థుల పై ప్రత్యెక దృష్టి సారించాలివిద్యార్థుల పై ప్రత్యెక దృష్టి సారించాలని టీచర్లను కలెక్టర్ ఆదేశించారు.

రుద్రంగిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు.

వారిని వివిధ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు.అనంతరం కిచెన్, స్టోర్ రూం పరిశీలించారు.

ఈరోజు మెనూ ప్రకారం ఏ ఏ ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు.విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.

విద్యాలయానికి ప్రహరీ నిర్మించాలని కలెక్టర్ కు విద్యాలయం బాధ్యులు విన్నవించారు.ఈ పర్యటనలో ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, డీఈఓ రమేష్ కుమార్, టీచర్ వనిత తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube