ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రుటిని సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్.ఆర్.

 Scrutiny Of Lrs Applications Should Be Completed On Time: District Collector San-TeluguStop.com

ఎస్ దరఖాస్తుల స్క్రుటిని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ( Sandeep Kumar Jha )సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు.జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ( Sirisilla, Vemulawada )పట్టణ ప్రాంతాలు, ఇతర గ్రామీణ ప్రాంతాలలో వచ్చిన మొత్తం 42,942 ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు, వివరాలను మండలాల వారీగా కలెక్టర్ తెలుసుకుంటూ పెండింగ్ ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల పై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రుటిని ప్రక్రియ 4 దశలలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ తెలిపారు.ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను సర్వే నెంబర్ వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం/మున్సిపాలిటీ లలో బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి జిపిఎస్ ద్వారా సదరు భూమి కో ఆర్డినేట్స్ పక్కాగా నమోదు చేస్తూ అదే సమయంలో ఈ భూములు నీటి వనరుల బఫర్ జోన్ ,నాలా,చెరువులు ,హెరిటేజ్ బిల్డింగ్ ,డిఫెన్స్ ల్యాండ్ పరిధిలో వస్తుందో లేదో చెక్ చేసి ధ్రువీకరించాలని అన్నారు.జిల్లాలో పెండింగ్ ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఫీల్డ్ లెవల్ సర్వే ధృవీకరణ ప్రక్రియ దరఖాస్తులు యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ పక్కాగా జరగాలని అన్నారు.మొదటి దశలో ధ్రువీకరణ పూర్తి చేసుకున్న దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా, రోడ్డు వెడల్పు ఓపెన్ స్పేస్ మొదలగు నిబంధనలు లేఔట్ లో పాటించారా అనే అంశాన్ని పరిశీలించి టౌన్ ప్లానింగ్ అధికారి ఆమోదించాలని, ఎల్.ఆర్.ఎస్ క్రింద భూముల క్రమబద్దీకరణకు జనరేట్ ఐన ఫీజు వివరాలు దరఖాస్తుదారులకు తెలియజేసి త్వరగా చెల్లించేలా ఫాలో అప్ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.ప్రతి మండలం పరిధిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను అధికారులు నిర్దేశిత సమయంలోగా ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఇన్చార్జి డీపీఓ శేషాద్రి,ఇరిగేషన్ ఈ.ఈ అమరేందర్ రెడ్డి , సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు మీర్జా ఫసహత్ అలి బేగ్, సంపత్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ,ఎం.పి.ఓ.లు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube