రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల వ్యవసాయ శాఖ ఆదికారిగా పదవి భాద్యతలు స్వీకరించిన మేడి కవిత ను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బొప్పాపూర్ వ్యవసాయ శాఖ మార్కేట్ కార్యాలయంలో శాలువాలు కప్పి సన్మానించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, ఎఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, గంట బుచ్చా గౌడ్ లు పాల్గొని సన్మానించారు.ఎల్లారెడ్డిపేట ఎఇఓ శ్రీ శైలం తదితరులు పాల్గొన్నారు.