రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీటీవీ ఇన్స్టాలైజేషన్ , సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ పై రెండు నెలల పాటు ఇవ్వనున్న ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతకు ఈరోజు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
ఈ సందర్భంగా ఎస్పీ( District SP Akhil Mahajan ) మాట్లాడుతూ….
యువత ఉద్యోగ అవకాశాలని అందిపుచుకోవాలని,కష్టపడి పనిచేయాలనుకునే యువత కోసం ఉద్యోగ అవకాశాలు క్యూ కడుతాయని, యువత ఖాళీగా ఉండకుండా తన విధ్యార్హతకు తగిన ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా, వచ్చిన ఉద్యోగంలో ప్రతిభ కనబర్చడం ద్వారా యువత అనుకున్న లక్ష్యాలను సాధించడం సులవుతుందని, వచ్చిన అవకాశాలను అందిబుచ్చుకోని ముందుకు సాగిపోవాలని పిలుపునిచ్చారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో NGO’s సంస్థ సహకారంతో రెండు నెలల ఉచిత వసతి భోజనం సదుపాయంతో సీసీటీవీ ఇన్స్టాలైజేషన్ , సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ పై ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న 25 మందికి ఈ రోజు శిక్షణ ప్రారంభించడం జరిగిందని,రెండు నెలల పాటు ఇవ్వనున్న శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ అనంతరం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాలలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా స్వతహాగా పెట్టుకునేవారికి రుణాల కోసం సంబంధిత బ్యాంకుల సహాయంతో అనుసంధానం చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
ఎస్పీ వెంట చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు, రూరల్ సి.ఐ మొగిలి, NGO’s సంస్థ అధికారులు ఉన్నారు.







