నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో పెరగడంతో జలకళను సంతరించుకుంది.మంగళవారం ప్రాజెక్ట్ అధికారులు రెండు గేట్లు ఒక అడుగు మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 655 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 643.85 అడుగులకు చేరుకుంది.ప్రాజెక్టు ఇన్ స్లో 1227.88 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ ఫ్లో 1077.87 క్యూసెక్కులుగా ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారి ఉదయ్ తెలిపారు.