రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బండ లింగంపల్లి గ్రామానికి చెందిన కామెడీ నర్సారెడ్డి (48 ) అనే రైతు పిడుగుపాటుకు గురై మృతి చెందగా వారి కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ బండ లింగంపల్లి గ్రామంలో కామెడీ నర్సారెడ్డి అనే రైతు పాలు పిండుకోవడానికి శివారు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పాలు పిండడానికి వెల్లగా పిడుగుపాటుకు గురై మృతి చెందడం జరిగిందన్నారు.
మృతుని భార్య చంద్రకళ కుమారుడు అజయ్ రెడ్డిలను పరామర్శించారు.
కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఈ సంఘటనపై సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో మాట్లాడటం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి లక్ష రూపాయల చెక్కును వెంటనే పంపించి డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణతో కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందన్నారు మిగతా ఐదు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వపరంగా వీరికి అందించి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు రైతు భీమా కూడా కూడా వీరి కుటుంబానికి వర్తించే విధంగా ప్రయత్నిస్తామన్నారు వీరి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, డైరెక్టర్లు శ్రీకాంత్ రెడ్డి,మండే శ్రీనివాస్,నారాయణ రెడ్డి, గంట చిన్న లక్ష్మి,నాయకులు జంగా అంజిరెడ్డి,బాలు యాదవ్, కొత్తపల్లి దేవయ్య, ఎండి హిమాం, ఎల్లా గౌడ్ హైమద్ ఉన్నారు.







