రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు వరి ధాన్యం విక్రయించాలని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం , ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య లు రైతులను కోరారు.ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో సోసైటీ ఆధ్వర్యంలో కిష్టంపల్లి,కిషన్ దాస్ పేట, బొప్పాపూర్, కోరుట్ల పేట సింగారం,బండలింగంపల్లి నారాయణపూర్,రాగట్లపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేర బేగం,సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి సేస్ డైరెక్టర్ కృష్ణహరి, ఎ.
ఏం.సి.వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా శనివారం ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్య ధలారులను నమ్మి రైతులు మోసపోవద్దని వారు పిలుపునిచ్చారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి , సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ జంగిడి సత్తయ్య , డైరెక్టర్లు వెంకట నరసింహ రెడ్డి , మెండే శ్రీనివాస్ యాదవ్, గంట లక్ష్మి బుచ్చా గౌడ్ మర్రి నారాయణరెడ్డి నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి , బండారి బాల్ రెడ్డి, గుర్రం రాములు ,ఎలగందుల నరసింహులు , పిల్లి కిషన్ , గుండాడి వెంకట్రెడ్డి , సందుపట్ల రాంరెడ్డి రైతులు అల్లం నారాయణ , తేలు శంకర్ తేలు లక్ష్మణ్ , బాద రాజు , అల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







